ప్రజలకు క్షమాపణ చెప్పిన మోడీ

2 Apr, 2014 10:43 IST|Sakshi
ప్రజలకు క్షమాపణ చెప్పిన మోడీ

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా జనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ ఆ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో ఎన్నికల ర్యాలీకి హాజరైన మోడీ, అక్కడ అప్పటివరకు వేచి ఉన్న ప్రజలను క్షమించాల్సిందిగా కోరారు. విషయం ఏమిటంటే.. రాయ్బరేలిలో జరిగే ఎన్నికల ర్యాలీ కోసం మోడీ సరైన సమయానికే ఢిల్లీలో బయల్దేరారు. కానీ, ఆయన వెళ్లాల్సిన హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోడానికి పౌర విమానయాన శాఖ అధికారులు అనుమతించలేదు. దాంతో మోడీ వెళ్లడం కొన్ని గంటల పాటు ఆలస్యమైంది.

ఉద్దేశపూర్వకంగానే అధికారులు తనను కొన్ని గంటల పాటు ఢిల్లీ విమానశ్రయంలో వేచి ఉండేలా చేశారని, అందువల్లే ఆలస్యం అయ్యిందని నరేంద్రమోడీ రాయ్బరేలీ వాసులకు వివరణ ఇచ్చుకున్నారు. ''మీ అమూల్యమైన సమయం వృథా అయింది. నా వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగకూడదు. అందుకే ఇవాళ జరిగిన దానికి చింతిస్తున్నాను. అందుకు క్షమించండి'' అంటూ రాయబరేలీ ర్యాలీలో బహిరంగ క్షమాపణలు కోరారు.

మరిన్ని వార్తలు