వైఎస్సార్‌సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ

14 May, 2014 23:26 IST|Sakshi
వైఎస్సార్‌సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ , టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని  ఎన్డీటీవీ సర్వే అంచనా వేసింది. సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకే అత్యదిక స్థానాలు దక్కుతాయని ఎన్డీటీవీ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం సీమాంధ్రలో మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్సీపీకీ 80 నుంచి 100 సీట్లు దక్కనున్నాయని సర్వే పేర్కొంది. టీడీపీ-బీజేపీ కూటమికి 75 నుంచి 95 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. ఎంపీల విషయానికి వస్తే మొత్తం 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 14 సీట్లు లభించే అవకాశముందని సర్వే పేర్కొంది. టీడీపీ-బీజేపీ కూటమికి 11 నుంచి 15 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.  
 
తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వస్తాయని ఎన్డీటీవీ సర్వే పేర్కొంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 66 నుంచి 80 సీట్లు సాధిస్తుందని ఎన్డీటీవీ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 30 స్థానాలు మాత్రమే సాధిస్తుందని అంచనా వేసిన సర్వే... టీడీపీ-బీజేపీ కూటమి 8 నుంచి 16 స్థానాలు సాధిస్తుందని వెల్లడించింది. ఇతరులకు 8 నుంచి 16 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. ఎంపీల విషయానికి వస్తే... మొత్తం 17 ఎంపీల్లో టీఆర్ఎస్‌ ఏకంగా 11 సీట్లు కైవసం చేసుకుంటుందని ఎన్డీటీవీ సర్వే పేర్కొంది. కాంగ్రెస్-3, టీడీపీ-బీజేపీ కూటమి-2 స్థానాలు లభిస్తాయన్న సర్వే ఇతరులకు ఒక స్థానం దక్కుతుందని తెలిపింది.
మరిన్ని వార్తలు