బతుకే యజ్ఞమైంది!

31 Mar, 2014 03:08 IST|Sakshi
బతుకే యజ్ఞమైంది!

బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్


 దాదాపు 37,000.. తెలుగునేలపై దేవాలయాల సంఖ్య. దేవుడికి అందరూ సమానమే. మనకు దేవుళ్లందరూ సమానమే. కానీ ప్రభుత్వానికి మాత్రం కాదు. ఆదాయం బాగా సంపాదించే దేవుడికి ఘనంగా ధూపదీప నైవేద్యాలు.. సకల సేవలు! కానీ.. ఆ దేవుడు పైసా సంపాదించకపోతే గుడిలో దీపానికీ దిక్కుండదు.


 సుమారు 82,00,000.. మంది బ్రాహ్మణులు. వీరిలో 60 శాతం దారిద్య్రరేఖకు దిగవనున్నారు. 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. 69 శాతం మందికి సొంత ఇళ్లు లేవు. చాలామందికి తెల్లరేషన్ కార్డులు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదు.
 
 బ్రాహ్మణులకూ.. బాబు ‘పోటు’
 
 1987లో తెలుగుదేశం ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సృష్టించింది. పొరపాటు గుర్తించి సర్దుకునేలోపే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. అనంతరం ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేసి అర్చకులకు రిటైర్మెంట్ వంటివి పెట్టి గెంటేసే ప్రయత్నం చేశాడు. టీడీపీ హయాంలో 32 వేల దేవాలయాలు మూతపడ్డాయి.
 
 ధర్మ రక్షణకు.. వైఎస్ కృషి
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి హిందూ సమాజానికి ఎంతో మేలు చేశారు. ధార్మిక రక్షణ ప్రాముఖ్యతను గుర్తించారు. ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ ధర్మాదాయ చట్టానికి 2007లో సవరణలు తెచ్చారు. దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు. 25 వేల దేవాలయాలను పునరుద్ధరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేశారు.
 ఆలనా..‘పాలనా’.. కావాలి
 
 వైఎస్ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రోశయ్య, కిరణ్‌లు చట్టాన్ని అమలుచేయలేదు. చాలా దేవాలయాలు శిథిలాలుగా మారుతున్నాయి.
 
 
 ఆదాయం వస్తే ఆలయం... అలంకారం! లేకపోతే శిథిలం.. అంధకారం!! ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రంలోని చాలా ఆలయాలు పతనావస్థకు చేరుతున్నాయి. ఆదాయాన్ని బట్టి చిన్నా, పెద్దా ఆలయాలుగా వర్గీకరించిన పాలకుల వివక్ష, నిర్లక్ష్యంతో వాటిపై ఆధారపడిన అర్చకులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 6బి, 6సి, 6డి కేటగిరీల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్నవారు ఇబ్బందిపడుతున్నారు.  దేవుడికి నైవేద్యాది కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున మాన్యాలుంటాయి. అయితే అవి ప్రాజెక్టుల ముంపులోనో.. అక్రమార్కుల కబ్జాల్లోనో.. రోడ్ల విస్తరణ పేరుతోనో.. హరించుకుపోతుంటాయి. మిగిలినవాటిలో ఆదాయం బాగా వచ్చే మాన్యాలపై అక్రమార్కుల పెత్తనం సాగుతోందనే ఆరోపణలున్నాయి. అధికారులు రైతులతో కుమ్మకై అర్చకులకు నామం పెట్టి కౌలుకు గండికొడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 37,000 అలయాలున్నా దేవాదాయ శాఖ కేవలం ఆదాయమున్న 100 ఆలయాల కోసమే అన్నట్లు పనిచేస్తోంది. మిగిలిన ఆలయాల సంగతి అటుంచితే.. కనీసం సంక్షేమ నిధి నుంచి అర్చకులకు సహాయం అందించాలని చూడటం లేదు. పూజారుల నెలసరి ఆదాయం 1500 కూడా ఉండదు.
 
 పురోహితుల ఆదాయం 2000 వేలకు మించి ఉండదు. ఈ రెండు వృత్తుల్ని నేర్చుకోవాలంటే 12 ఏళ్లు పడుతుంది. అయినప్పటికీ వేదవిద్యకు గౌరవం లేకుండా పోతోంది. అందుకే చాలామంది గ్రామాల నుంచి వలస బాటపట్టారు. ఎంతోమంది వృత్తిని వదిలారు. కొత్తతరం ఇటువైపు ఆసక్తి కూడా చూపడం లేదు. అయితే..  సరిపడా నిధులున్నా.. అష్టకష్టాలను ఎదుర్కొంటున్న అర్చకులకు ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇవ్వడం మరిచింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. ఇతరత్రా అవసరాల కోసం వందలాది దరఖాస్తులు పెట్టుకున్నా చలనం లేదు. దీంతో వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇటీవల దేవాదాయ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్ ఫైళ్ల వైపు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
 
 ఆందోళన పథంలో..
 
 గత కొద్దిరోజులుగా అర్చకులు ఆందోళనపథంలో ఉన్నారు. అర్చక సమాఖ్యకు కేటాయించిన డబ్బును ప్రాంతాలవారీగా కేటాయించాలని కోరుతున్నారు. కాంట్రాక్టు అర్చకులను రెగ్యులరైజ్ చేయాలని, కనీస గౌరవ వేతనం అందజేయాలని.. పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 సమస్యల్లో అర్చకులు
 ప్రభుత్వాల నిర్వాకం వల్ల అర్చకులు వీధినపడుతున్నారు. వేతనాలు ఇవ్వడం లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రాజకీయాలు ప్రవేశించాయి. వాటి కింద భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని కాపాడటంలో దేవాదాయశాఖ అధికారులు విఫలమవుతున్నారు.  

 - ఉపేంద్రశర్మ,
  ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య
 
 సవరించిన చట్టాన్ని అమలుచేయూలి


 వైఎస్ సవరించిన చట్టాన్ని అమలు చేయాలి. ఆ చట్టం వల్లే దేవాలయూల పునరుద్ధరణ జరిగింది. అర్చకులకు భద్రత ఏర్పడింది. ఈ చట్టాన్ని అమ లు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన వారికే మేము ఓటేస్తాం.
 - సౌందర్‌రాజన్,
 చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు
 
 
 
 
వైఎస్ హయాంలోనే న్యాయం


 వైఎస్ హయాలోనే మాకు న్యాయుం జరి గింది. పూజలు చేసిన ప్రతీసారి ఆయనతో మా సమస్యలు ప్రస్తావించిన. ఒక్కొక్కటిగా పరిష్కారమైనయ్. ఇప్పటి నాయుకులను అడిగితే.. ‘మాకే బోలెడు సవుస్యలున్నయ్.. మిమ్మల్నేడ చూసే ది..’ అని అంటున్నరు.
 - నమిలకొండ రాజేశ్వర శర్మ, ప్రధానార్చకుడు, శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ
 
 గౌరవం పెరగాలి
 రోజురోజుకీ అర్చకుల గౌరవ ప్రతిష్ఠలు తగ్గిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనైనా గౌరవం పెరగాలి. గౌరవ వేతనం ఇవ్వాలి. చిన్న దేవాలయూల్లో అర్చకులకు తగిన వుూలవేతనం, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇనాం భూముల ఆచారాన్ని తిరిగి కొనసాగించాలి.  
 - పొడిచేటి జగన్నాథాచార్యులు, ప్రధాన అర్చకులు,
 శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం
 
 294 స్థానాలకు నలుగురా..?   
 వచ్చే ప్రభుత్వమైనా బ్రాహ్మణులకు రాజకీయుంగా తగిన ప్రాధాన్యం కల్పించాలి. అర్చకుల సమస్యలు పరిష్కరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్రాహ్మణుల సంఖ్య నలుగురికే పరిమితమైందంటే  పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 - ప్రవీణ్ పాఠక్, స్థాన చార్యుడు, సరస్వతీదేవి ఆలయుం, బాసర, నిజామాబాద్
 
 అధికారంతో ‘ఆత్మగౌరవం’
 
 సమాజాన్ని ఐక్యంగా ఉంచేందుకు శాయశక్తులా కృషి చేసిన బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. పవిత్రమైన సంప్రదాయక, సాంస్కృతిక భావనల నేపథ్యంలో వీరి కృషి ఎనలేనిది. అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 60 శాతం బ్రాహ్మణ కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండటమే ఇందుకు నిదర్శనం.  సమాజంలోని ఏ వర్గమూ ఉపేక్షకు గురి కాకూడదన్నదే మన రాజ్యాంగ స్ఫూర్తి... ఇందుకు అనుగుణంగా బ్రాహ్మణ సామాజికవర్గం స్థితిగతుల నిర్ధారణకు, అభ్యున్నతికి ఓ కమిషన్ అవసరమని విజ్ఞులంటున్నారు. ‘ఆత్మగౌరవం’ కోసం అధికారంలో వాటా పెంచాలని కోరుతున్నారు.
 
 ప్రధాన డిమాండ్లు
     విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు
     అన్ని దేవాలయాల్లోని నామినేటెడ్, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో స్థానం
     చిత్ర పరిశ్రమలో బ్రాహ్మణులను కించపరిచే విధానాన్ని అరికట్టేందుకు చట్టం
     {బాహ్మణ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు జిల్లాలో
     ఒక స్పెషలాీఫీసర్‌తో సర్వే


      మొదటి అసెంబ్లీలో అత్యధికంగా ఉన్న ప్రాతినిధ్యం ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. కాబట్టి రాజకీయ అవకాశాలు మరిన్ని కల్పించాలి. అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం పెంచాలి.
 
 వైఎస్ రాకతో మారిన పరిస్థితి..
 
 వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు. చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా అర్చకులు వైఎస్సాఆర్‌ను ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా. ఈ హామీతో వైఎస్సాఆర్‌కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు.
 
 అర్చక వెల్ఫేర్ ఫండ్‌ని ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దానిద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు
 అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు
 విద్య గృహనిర్మాణానికి రుణాలు అందజేశారు
 గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు
 ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు
 కామన్‌గుడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి దేవాలయాల పునరుద్ధరణకు శ్రీకారంచుట్టారు
 
 
 ధార్మిక పరిషత్‌తో..
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసి అర్చకులకు వేతనాలు అందించాలని చెప్పారు. 33/2007 సెక్షన్-ఎ ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక బ్యాంకు ఏర్పాటు చేసి వేతనాలు అందించాలని చట్టాన్ని సవరించారు. అందరు ఎమ్మెల్యేలను ఒప్పించి మరీ ఈ చట్టాన్ని ఆమోదింపచేశారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు సేవా టిక్కెట్లలో వాటా, హుండీల్లో వాటా ఉండాలని చెప్పారు.  దేవాలయాల్లోని ధర్మకర్తల మండలిలో అర్చకులకు స్థానం కల్పించారు. గ్రామాల్లో వర్షాలు పడాలన్నా... రైతుల జీవితాలు బాగుపడాలన్నా గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు కొనసాగాలని, అలా ఉండాలంటే అర్చకుల జీవితాలు బాగుపడాలని వైఎస్ ఆకాంక్షించారు. ఆ మేరకు ఐదు వేల దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కింద ప్రతి అర్చకునికి నెలకు రూ. 2,500 చొప్పున వేతనం అమలుచేశారు. అయితే ప్రస్తుతం ఈ వేతనాన్ని ఐదు ఎకరాల భూమి ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు నిలిపివేశారు. దీంతో ఆయా కుటుంబాలన్నీ నానా ఇబ్బందులు పడుతున్నాయి.
 
 
 దేవాలయ వ్యవస్థను కుప్పకూల్చిన చట్టం
 దేవాలయాలకు సంబంధించి 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం చల్లా కొండయ్య కమిషన్ వేసింది. దేవాలయాలు బ్రాహ్మణులు జీవించడం కోసం పెట్టుకున్నవేనని కమిషన్ నివేదికను ఎన్టీఆర్ నమ్మారు. ఈ నేపథ్యంలోనే 1987లో దేవాదాయ ధర్మాదాయ చట్టం తీసుకొచ్చారు. ఇది ఆలయాల్లో అర్చక బాధ్యతలకు వంశపారంపర్య హక్కును తొల గించింది. హారతి పళ్లెంలో వచ్చే చిల్లరను కూడా అర్చకులు తీసుకోవద్దని శాసించింది. అర్చకులకు ఆలయాల్లో భక్తులు ఇచ్చే సంభావనలను అడ్డుకుంది. వాటిని హుండీ లో వేయించింది. అర్చకులు ఎక్కడ ఓ రూపాయి కోసం ఆశపడాతారోనన్న అనుమానంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.
 
 తప్పు దిద్దుకునేలోపే ఎన్టీఆర్‌కు బాబు పోటు
 ఈ చట్టం తమ జీవితాలను చిందరవందర చేసిందని అర్చకులంతా ఎన్టీఆర్‌కు మొరపెట్టుకున్నారు. వాస్తవం గుర్తెరిగి అర్చకుల న్యాయమైన డిమాండ్లను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఎన్టీఆర్ వేశారు. 1995 ఆగస్టు 15న ఏర్పడిన  ఈ కమిటీ నివేదిక సమర్పించే సమయానికి ఎన్టీఆర్‌ను దించేసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పరిస్థితి మరింత దారుణమైన స్థితికి చేరుకుంది.
 
 గుడిగంటే.. ఉరికొయ్య
 చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అర్చకులు, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు. 2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్‌మెంట్ స్కీంను పెట్టారు. జీతాలు లేవు... పెన్షన్లు లేవు... రిటైర్‌మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది. దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి  2001, సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


 

మరిన్ని వార్తలు