మరే బిడ్డ ఉద్యమబాట పట్టకూడదు

16 Apr, 2014 01:21 IST|Sakshi

అమ్మ మాట..  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుండడంతో ఆందోళన చెందిన నా కొడుకు రామకృష్ణ గతేడాది సాగర్ కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకును పోగొట్టుకుని కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నాం. నా భర్త అనారోగ్యంతో మంచంపట్టి నరకం అనుభవిస్తున్నాడు. మాలాంటి వారికి గుండె ధైర్యం కల్పించే పాలన రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మరేబిడ్డ ఉద్యమబాట పట్టకుండా అభివృద్ధి చేయాలి. అప్పుడే ఆత్మత్యాగం చేసిన బిడ్డల ఆత్మలు శాంతిస్తాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి పేదకు రెండు గదులతోపాటు వంటగది ఉండేలా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. రేషన్ షాపుల ద్వారా నెలకు ఒకరికి పది కిలోల చొప్పున నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి. అలాగే నెలకు సరిపడా పప్పులు, ఉప్పు, నూనె అందిస్తే ఆకలి బాధలు ఉండవు. మద్యాన్ని నిషేధించాలి. ప్రతి పల్లెకు మినరల్ వాటర్ పంపిణీ చేయాలి. అమరుల జ్ఞాపకార్థం ప్రభుత్వమే విగ్రహాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు రైలు, బస్‌పాస్‌లు అందించాలి. బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు కష్టాల్లో ఉన్న మాలాంటి వారికి వృద్ధాప్యంలో పింఛన్ ఇవ్వాలి.
 - మాదినేని శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్

>
మరిన్ని వార్తలు