‘టీ’ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

3 Apr, 2014 01:41 IST|Sakshi
‘టీ’ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలోభాగంగా బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 9 చివరి తేదీ. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు 12వ తేదీ చివరి రోజు. ఈనెల 30న ఎన్నికలు నిర్వహించి మే 16న ఫలితాలు వెల్లడిస్తారు.
 మరో 6 రాష్ట్రాల్లోని 72 స్థానాలకూ నోటిఫికేషన్: తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు మరో 6  రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 72 స్థానాలకూ ఏడో దశ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. గుజరాత్‌లో 26 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 14 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 9 స్థానాలు, బీహార్‌లో 7, జమ్మూకాశ్మీర్, డామన్ డయూ, దాద్రా నగర్ హవేలీలలో ఒక్కో సీటుకు ఈ దశ కింద ఎన్నికలు జరగనున్నాయి.
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా