బాబు పాలనలో వృద్ధుల ఆకలి కేకలు

25 Mar, 2014 01:10 IST|Sakshi
బాబు పాలనలో వృద్ధుల ఆకలి కేకలు

ముదిమి వయుసులో రూ.75 పింఛన్ కోసం చంద్రబాబు ప్రభుత్వంలో నరకం చూడాల్సి వచ్చేది. ఒక లబ్ధిదారుడు చనిపోతే తప్ప మరొకరికి పింఛన్ ఇవ్వలేని దుస్థితి. 2002లో జరిగిన ఒక ఘటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. నెల్లూరుకు చెందిన 68 ఏళ్ల చింతల పుల్లవ్ము పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సర్కారు కరుణించలేదు. ఓ ‘తెలుగు తవుు్మడు’ చెబితే అప్పు చేసి మరీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చింది పుల్లమ్మ. పడిగాపులే తప్ప చంద్రబాబును కలిసి గోడు చెప్పుకొనే భాగ్యం కలగలేదు. వారం పాటు నిరీక్షించాక ఆకలి భరించలేక పుల్లవ్ము భిక్షాటన చేయూల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన వ్యూచింగ్ గ్రాంటునే సగానికి కోతవేసి రూ.75 చొప్పున విదిల్చిన ఘనుడు చంద్రబాబు.

మరిన్ని వార్తలు