కారు దిగుతారా?

26 Mar, 2014 10:51 IST|Sakshi
కారు దిగుతారా?

ఈ ఎన్నికల్లో వివేకంతో వ్యవహరించాలని  పెద్దపల్లి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కాకాగా పేరు మోసిన జి.వెంకటస్వామి కొడుకు వివేక్‌ డిసైడ్‌ అయ్యారు. తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్న  టీఆర్ఎస్ కంటే ఇచ్చిన కాంగ్రెస్‌నే ఆయన నమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వివేక్ భావిస్తున్నట్లు సమాచారం‌.  తెలంగాణకు దళిత సీఎం అని ప్రచారం జరుగుతున్న సమయంలో కాలం కలిసొస్తే తనకు ముఖ్య పదవి లభిస్తుందని ఆయన ఊహిస్తున్నారు‌.  ఈ విషయంలో రాహుల్‌ సన్నిహితుడు, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు  కొప్పుల రాజు అండదండలు వివేక్‌కు దొరికినట్టు తెలుస్తోంది.

ఇక తొందరపడి ముందే కూసిన కోయిలలా....కారెక్కినా అందులో సరైన ట్రీట్‌మెంట్‌ లభించకపోవడం,  కీలక నిర్ణయాల్ని తనకు మాట మాత్రమైన చెప్పకపోవడం వివేక్‌కు బాగా బాధపెడుతోన్నట్లు తెలుస్తోంది.  దాంతో ‘కారు ’పై మోజు తీరిందో ఏమో కానీ ఆయన మళ్లీ తన పాత గూటికే  అడుగులు వేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో వార్తల్లో కనిపించే వివేక్ ఇప్పుడు తెరచాటు అయ్యారు. టీఆర్ఎస్లో ఆయన ఊసే వినిపించటం లేదు. టీఆర్ఎస్ పార్టీలో చేరితో ఏదో ఒరుగుతుందని అనుకున్న వివేక్ అక్కడ ఏ విషయం లేకపోయే సరికి మళ్లీ చేయి అందుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు