ఈశాన్య భారతంలో రెండో విడత పోలింగ్

9 Apr, 2014 12:12 IST|Sakshi
ఈశాన్య భారతంలో రెండో విడత పోలింగ్

ఈశాన్య భారతంలోని నాలుగు రాష్ట్రాల్లోని ఆరు ఎంపీ నియోకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు పోలింగ్ లో ఓటర్లు చురుకుగా పాల్గొంటున్నారు. అరుణాచల్, మేఘాలయల్లో చెరి రెండు, నాగాలండ్, మణిపూర్ లలో చెరొక సీటు ఉన్నాయి. దీనితో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 సీట్లకు గాను పోలింగ్ జరుగుతోంది. మిజోరామ్ లోనూ పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ బ్రు తెగ ఓటర్లకు ఓటు వేసే సదుపాయాన్ని కల్పించినందుకు నిరసనగా రాష్ట్ర బంద్ జరిగింది. దీనితో అక్కడ ఎన్నికలు ఏప్రిల్ 11 న జరుగుతాయి.

నాగాలాండ్ లోని ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం తొలి మూడు గంటల్లోనే 20.9 శాతం ఓట్లు పడ్డాయి. నాగాలాండ్ లో 2059 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లలోనూ పోలింగ్ చురుకుగా సాగుతోంది. ప్రధానంగా గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే మణిపూర్ ఔటర్ లోకసభ నియోజకవర్గంలోనూ పోలింగ్ సాగుతోంది. ఇక్కడ పోటీలో పదిమంది అభ్యర్థులున్నారు. మేఘాలయలో ని తురా నియోజకవర్గం నుంచి మాజీ లోకసభ స్పీకర్ పి.ఎ. సాంగ్మా కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడ పదిహేను లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకున్నారు.
 

మరిన్ని వార్తలు