గిప్పుడన్నా మాకు న్యాయం జరగాలె

12 Apr, 2014 02:38 IST|Sakshi
గిప్పుడన్నా మాకు న్యాయం జరగాలె

అమరుడు నర్ముల పుల్లయ్య తల్లి లచ్చమ్మ
 గ్రామం: ధర్మపురి, కరీంనగర్ జిల్లా
 
 అమ్మ మాట..
 తెలంగాణ రాదని ఎవలో అన్నరని బెంగతో నా కొడుకు పుల్లయ్య(31) ఉరేసుకుని పాణాలు తీసుకున్నడు. తెలంగాణ అంటే సాలు అన్ని మర్చిపోయేటోడు. ఉద్యమంల తిరిగెటోడు. ఇంటిపట్టున పెద్దగా ఉండకుండె. గింత తిని మళ్లీ ఉరికెటోడు. ఉద్యమం ఎంత జేసినా ఇంక తెలంగాణ రాదని ఎవ రో అన్నరంట.. గంతే ఆమాటకే మనసు పాడుజేసుకున్నడు. ఆ దినం నుంచి సక్కగ మాట్లాడేటోడు కాదు.
 
 ఒకదినం ఉరేసుకుని సచ్చిపోయిండు. కొడుక్కి భార్య సుజాత, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆడు సచ్చిపోవడంతో ఆళ్లంతా ఇప్పుడు అనాథలైండ్రు. ఇంట్లో అందరికీ ఆవేదన మిగిల్చిండు. నా బిడ్డడు సచ్చిపోయినంక తెలంగాణ అచ్చింది. గిప్పుడాడుంటే బాగుండె. తెలంగాణ అచ్చింది కాబట్టి మాలాంటోళ్లకి న్యాయం చెయ్యాలె. అన్ని వసతులు కల్పించాలి. కూడు, గూడు, గుడ్డకు కరువుండకుండా చేయాలె. తాగునీరు అందించాల. పంటలకు నీళ్లు అందించే ఏర్పాట్లు చేయాల. అన్ని వసతులు కల్పిస్తేనే మాలాంటోళ్ల కష్టాలు తీరుతయి. గప్పుడే నా బిడ్డ ఆత్మ శాంతిస్తది.
  - సేకరణ : శ్రీరాములు, ధర్మపురి
 

మరిన్ని వార్తలు