ప్రజాసంక్షేమం జగన్‌కే సాధ్యం

30 Mar, 2014 02:35 IST|Sakshi

 వెంకటాచలం, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కసుమూరులో పూల కోటేశ్వరరావు, గుర్రం మల్లికార్జున్, తురకా పెంచలయ్య, బెల్లం సురేంద్ర, వీరేపల్లి మహేష్, బాలా రమేష్, దేవళ్ల రత్నంతో పాటుగా తమ వర్గీయులు కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో శనివారం పార్టీలో చేరారు.

 

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. సీమాంధ్రులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తీరని అన్యాయం చేశాయన్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం అవలంబించి తెలంగాణ విభజ నకు కారణమయ్యారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత విభజనకు మద్దతు తెలిపి అనంతరం రాజీనామాతో సరిపెట్టుకున్నారన్నారు.

 

సోనియా తన కుమారుడిని ప్రధానిని చేయాలని స్వార్థపు రాజకీయాలతో తెలంగాణ విభజన జరిగిందన్నారు.  ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ విభన బిల్లుకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాటాలు చేశారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ఫ్యాను గుర్తు కు ఓట్లు వేసి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నాయకులు వడ్లమూడి సురేంద్రనాయుడు, పి.హుస్సేన్, ఈశ్వరనాయుడు, పూల శ్రీనివాసులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు