రంపచోడవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి

22 Apr, 2014 00:57 IST|Sakshi
రంపచోడవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి

రంపచోడవరం, న్యూస్‌లైన్ :రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి బరిలో నిలిచారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్‌ను ఇక్కడ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడంతో ఆయన నామినేషన్ వేశారు. అయితే సోమవారం నాటి పరిశీలనలో ఉదయభాస్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పార్టీ తరఫున ద్వితీయ ప్రాధాన్యత అభ్యర్థిగా నామినేషన్ దాఖ లు చేసిన రాజేశ్వరి పేరును పార్టీ ఖరారు చేసింది.

రాజకీయ నేపథ్యం గల కుటుంబానికి చెందిన రాజేశ్వరి 2006లో అడ్డతీగల ఎంపీపీగా  పనిచేశారు. ఆమె తండ్రి వంతల కొండబాబు 1987లో అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడుగా, 1989లో అడ్డతీగల ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు వంతల సూర్యనారాయణరెడ్డి దాకోడు సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. అడ్డతీగల మండలం దాకోడుకు చెందిన  రాజేశ్వరి భర్త సోంబాబు  వ్యవసాయం చేస్తారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏజెన్సీలోని ఆదిమ గిరిజన తెగ ల్లో ఒకటైన కొండరెడ్డి కులానికి చెందిన రాజేశ్వరి అన్ని వర్గాల ఆదరణతో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు