తిమ్మాపూర్: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయనని ధూం..ధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ...పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి తాను పోటీలో ఉండనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
అవన్నీ వట్టి మాటలేనని, మానకొండూర్ నుంచి తప్ప వేరే ఎక్కడా పోటీ చేయనని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశించినా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలి. అందుకోసం పోరాడాలని పిలుపునిచ్చారు.