టీఆర్‌ఎస్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం

31 Mar, 2014 04:25 IST|Sakshi

పాన్‌గల్,న్యూస్‌లైన్: అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్ పార్టీ కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి రవితో కలిసి ఆదివారం మండలంలోనిగోప్లాపూర్,దొండాయిపల్లి,దావాజిపల్లి,మాందాపూర్,రాయినిపల్లి,బుసిరెడ్డిపల్లి తదితర గ్రామాలల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్రంలో నీరు,నిధులు పుష్కలంగా ఉంటే మిగతా వసతులు సమకురుతాయన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్రం సాధించింది టీఆర్‌ఎస్ పార్టీయే అన్నారు.
 
 
 విద్యార్థుల ఆత్మబలిదానాలకు  కాంగ్రెస్ పార్టీయే కారణం


 {పత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం 1200మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఆలాంటి పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఓటు అడిగే హాక్కు టీఆర్‌ఎస్ పార్టీకి తప్పా మరొక పార్టీకి లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2015 అగస్టు నాటికి కృష్ణా ద్వారా కాలువల ద్వారా సాగునీరు అంది ప్రతి సెంటు భూమి సస్యశ్యామలమవుతుందన్నారు.
 
 దొండాయిపల్లి,దావాజిపల్లి,బుసిరెడ్డిపల్లి గ్రామాలల్లో వివిధ  పార్టీలకు చెందిన 40మంది ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమములో విండో చైర్మన్ బాల్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు ఠాకూర్‌నాయక్,విజయలక్ష్మి,సత్యం,నాయకులు చంద్రశేఖర్‌నాయక్,శేఖర్‌రెడ్డి,జనార్ధన్‌గౌడు,గోవర్దన్‌సాగర్,కుర్వబాలయ్య,ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి