వెబ్‌కాస్టింగ్‌కు 7వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

29 Apr, 2014 22:14 IST|Sakshi

హైదరాబాద్: ఎన్నికల్ వెబ్ కాస్టింగ్‌కు 7 వేల ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు వలంటీర్లుగా వెళ్తున్నట్లు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వైస్ ఛాన్స్‌లర్ రాజ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రలో జరిగే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో బాసర, ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈనెల 30న తెలంగాణలో జరిగే ఎన్నికల్లో 2,250 మంది బాసర క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. 2011 నుంచి తమ విద్యార్థులు ఎన్నికల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు వివరించారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు