'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'

3 Apr, 2014 13:09 IST|Sakshi
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'

హైదరాబాద్ : కార్యకర్తల అభీష్టం మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.  పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించటంపై కార్యకర్తలు గురువారం సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగారు.

మహేశ్వరం నుంచే పోటీ చేసే విషయంలో అధిష్టానంతో మాట్లాడతానని సబితా ఈ సందర్భంగా కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఓ కార్యకర్త వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించగా, ఆ ప్రయత్నాన్ని సహచర కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు