రమ్యను దెబ్బతీసిన దూకుడుతనం

17 May, 2014 09:44 IST|Sakshi
రమ్యను దెబ్బతీసిన దూకుడుతనం

బెంగళూరు : మండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పోటీకి దిగిన నటి రమ్య అనూహ్యంగా ఓటమిని చవి చూశారు.  శాసనసభ ఎన్నికల్లో తన తల్లికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆమె గత ఏడాది ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికలోవిజయం సాధించారు.


ఈ ఎనిమిది నెలల కాలంలో సొంత పార్టీలోనే వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఆమె వ్యవహార శైలి, దూకుడుతనాన్ని కార్యకర్తలు సహించలేక పోయారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ కూడా ఆమె వైఖరిని నొచ్చుకున్నారు. చికిత్స కోసం ఆయన సింగపూర్‌లో చాలా రోజులు ఉండిపోవడం కూడా రమ్యకు నష్టంగా పరిణమించింది.

తాను గతంలో ఎంపీగా ఎన్నికైనా ఆరు నెలలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో ప్రజల సమస్యలను పరిష్కారానికి సమయం లేకపోయానని ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని రమ్య చెప్పినా ఓటర్లు మాత్రం ఆమె హామీలను విశ్వసించలేదు. దాంతో రమ్య ఎంత త్వరగా ప్రచారంలోకి వచ్చిందో  అంతే త్వరగా ఓటర్ల నుంచి తిరస్కరణకు గురయ్యింది. దాంతో గతంలో నటనకు స్వస్తి చెబుతానని ప్రకటించిన ఆమె పరాజయంతో మళ్లీ వెండితెరపై దృష్టి పెడుతుందేమో చూడాలి.



 

మరిన్ని వార్తలు