డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’

8 May, 2014 04:53 IST|Sakshi
డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం పోలింగ్ సందర్భంగా జరిగిన భద్రత చర్యలను డీజీపీ  ప్రసాదరావు, ఇతర ఉన్నతాధికారు లు డీజీపీ కార్యాలయం నుంచి హైటె క్ పరిజ్ఞానంతో పర్యవేక్షించారు. ఈ తరహాలో బందోబస్తు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలను నిరంతరం పరిశీలించడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన క్వాడ్రివియం సంస్థ తయారు చేసిన స్పెషల్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన అత్యాధునిక పరికరాన్ని డీజీపీ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్‌లో ఏర్పాటు చేశారు.
 
 ఈ సంస్థ రూపొందించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీలు, ఆపై స్థాయి అధికారులు సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేశారు. ఆ ఫోన్లకు ఉన్న జీపీఎస్ వ్యవస్థను యాక్టివేట్ చేయడంతో సంబంధిత అధికారి ఫోన్ సర్వర్‌కు అనుసంధానమౌతుంది. దీని ఆధారంగా ఆయన ఎక్కడ విధుల్లో ఉన్నారనేది ఎలక్షన్ సెల్‌లో ఉన్న డిజిటల్ తెరపై కనిపిస్తుంటుంది.

>
మరిన్ని వార్తలు