వైఎస్సార్‌సీపీ ఏజెంట్ హఠాన్మరణం

7 Apr, 2014 00:20 IST|Sakshi

పగిడ్యాల, న్యూస్‌లైన్: స్థానిక 18వ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న కుమ్మరి నరసింహులు(30) హఠాన్మరణం చెందాడు. ఉదయం 7 గంటలకు ఏజెంట్‌గా కూర్చున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రంలోనే మూర్చ వచ్చి  కింద పడిపోయాడు. గమనించిన పోలింగ్ సిబ్బంది వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుదుడికి వద్దకు తీసుకెళ్లగా ఆయన చికిత్స చేస్తుండగా కొద్ది సేపటికే మృతి చెందాడు.

 

మృతునికి విజయలక్ష్మి, భార్గవి, వైష్ణవి, హేమంత్‌కుమార్ నలుగురు పిల్లలు సంతానం. భార్య కూడా  ఆరు నెలల క్రితమే మృతి చెందింది. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరు దూరం కావడంతో వృద్ధురాలైన మృతుని తల్లి నాగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది.  విషయం తెలుసుకున్న వైఎఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పగిడ్యాలకు చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

 

నలుగురు పిల్లలను బాగా చదివించే బాధ్యతను తీసుకుంటానని మాండ్ర శివానందరెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పగిడ్యాల -2 ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన రమాదేవి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చారు. పలువురు నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments