బిజెపితో పొత్తుపై టిడిపి స్పందన కరవు

29 Mar, 2014 18:16 IST|Sakshi
బిజెపితో పొత్తుపై టిడిపి స్పందన కరవు

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కిరాలేదు.  పొత్తులపై టీడీపీ నుంచి సానుకూల స్పందన లేదని బీజేపీ వర్గాలు  తెలిపాయి. సీట్ల సంఖ్య విషయంలో టీడీపీ వ్యవహారం సరిగ్గా లేదని వారు చెబుతున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహారశైలితో బిజెపి నేతలు విసిగిపోయారు. టీడీపీ పక్షాన ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్‌లు ఇప్పటికే పలు దఫాలుగా బీజేపీ నేతలతో చర్చించారు.

టిడిపి అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు కూడా శుక్రవారం సాయంత్రం స్వయంగా రంగంలోకి దిగి బీజేపీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు  ప్రకాశ్ జవదేకర్‌తో రెండు గంటల పాటు చర్చించారు.  అయినా పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. (చంద్రబాబుతో కుదిరేలా లేదు)దాంతో వారు ఒంటరి పోరుకు  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల జాబితాతో ఢిల్లీకి రావాలని ప్రకాశ్‌జవదేకర్‌కు బీజేపీ అధిష్టానం ఆదేశించింది.

ఈ నేపధ్యంలో ఈ సాయంత్రం తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చిస్తారు. ఉగాది రోజున అభ్యర్ధులను ప్రకటించడానికి బిజెపి  సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు