మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా

10 Apr, 2014 03:45 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నల్లగొండ, న్యూస్‌లైన్, నల్లగొండ జిల్లాను మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తాం..హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో మేకల అభినవ్‌స్టేడియంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జయభేరి సభలో ప్రసగించారు. సభకు భువనగిరి, నల్లగొండ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


 ఈ సమావేశానికి ముందు బ్రదర్స్ ఇద్దరు వారి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి వారు ప్రసగించారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పాటుపతానని కోమటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అదే విధంగా బ్రాహ్మణవెల్లెంల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయించి 4 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందేలా చేయడమే తన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.

పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలి చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు. ప్రజా సేవయే పరమావధిగా భావించి రేయింబవళ్లు వారి శ్రే యస్సు కోసం పాటుపడుతున్నానన్నారు. ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తెలంగాణలోనే అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో  ఎమ్మెల్సీ పదవి ఇప్పిం చేందుకు కృషి చేస్తామని  హామీ ఇచ్చారు.

 టీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు : ఎంపీ గుత్తా

 ఈ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఎంపీ సుఖేందర్‌రెడ్డి తెలిపా రు. అభ్యర్థులు ఎవరో తెలియని వారికి కేసీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చాడన్నారు. ఉద్యమకారులకు కాకుండా తెలంగాణ ద్రోహులకు పార్టీ టికెట్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

 కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి  

 ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య, సీపీఐ మునుగోడు అభ్యర్థి పల్లావెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీం దర్, డీసీసీ ధ్యక్షడు తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు కోరారు.   

 సమావేశానికి వీరితో పాటు భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అద్దంకి దయాకర్, తండు శ్రీని వాస్‌గౌడ్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముంగి చంద్రకళ,మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా తనయుడు అమిత్‌రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు