వేడెక్కిన గ్రామీణం

12 May, 2014 03:42 IST|Sakshi

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఫలితాలను వాయిదా వేసింది. ఈనెల 7న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో 13న ఉదయం 8 గంటలకు ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చర్చనీయాంశమైంది. అధికారులు ఈ రికార్డులను చిత్తు కాగితాలుగా పేర్కొంటున్నా.. నిజానిజాలు కొత్త పాలకవర్గం ఏర్పాటుతో వెల్లడి కానుంది. సోమవారం కర్నూలు నగరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో పాటు కీలక సిబ్బంది ఆ విధుల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

ఆదివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ ఆవరణ నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గుర్తించి కార్యాలయ కింది స్థాయి సిబ్బందికి సమాచారం చేరవేశారు. వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి పలు రికార్డులు కాలిపోగా.. మరికొన్ని మంటలను ఆర్పేందుకు వినియోగించిన నీటితో ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పాత రికార్డు గదికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. చిమ్మచీకట్లో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడ్డారు.

పోలీసులు, ఎలక్ట్రానిక్ మీడియా లైటింగ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం వెనుక గత పాలకవర్గాల కుట్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2005 నుంచి 2010 సంవత్సరాల మధ్య కౌన్సిల్‌లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు విచారణ చేపట్టాలని కోరినా అప్పటి మున్సిపల్ చైర్మన్ కైప రాముడు, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ అంగీకరించలేదు. తాజాగా ఏర్పాటయ్యే పాలకవర్గం అప్పటి అక్రమాలపై ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందోననే భయంతోనే ఇలా చేసి ఉంటారా? అని పలువురు అనుమానిస్తున్నారు.

కాలింది చిత్తు కాగితాలే: రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్
అగ్ని ప్రమాదంలో కాలిపోయింది చిత్తు కాగితాలు మాత్రమే. ఆ గదిలో కీలక రికార్డులేవీ లేవు. 2009లో సంభవించిన వరదల్లో పూర్తిగా పనికిరాకుండాపోయిన పలు పేపర్లను ఆ గదిలో భద్రపరిచాం. గత పది సంవత్సరాలకు సంబంధించిన రికార్డులన్నీ సురక్షితంగానే ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. కౌంటింగ్ ముగిసిన వెంటనే ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం.

>
మరిన్ని వార్తలు