ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ?

21 Mar, 2014 12:01 IST|Sakshi
ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ?

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి ఉదయభాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ఆమె పాలిటిక్స్లోకి అడుగుపెట్టనున్నారని చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తానని గతంలో ఆమె చెప్పిన విషయాలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

తాను రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని భాను భావిస్తున్నారు(ట). తెలుగనాట అగ్రస్థానంలో ఉన్న బుల్లితెర వ్యాఖ్యాతల్లో ఒకరైన ఉదయభానుకు మంచి క్రేజ్ ఉంది. వివాదాల కారణంగా ఆమె పలుమార్లు పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు ఆమె రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవడంతో ఆశావహులు తమకు నచ్చిన పార్టీల్లో చేరిపోతున్నారు. రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు సిద్ధమవుతున్నారు. ఉదయభాను కూడా ఈ కోవలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పాలిటిక్స్లో అడుగుపెట్టేందుకు ఆమె పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. త్వరలోనే ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటున్నారు. ఇదే నిజమయితే ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తి కలిగించే విషయం.

మరోవైపు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. సొంత జిల్లా కరీంనగర్  నుంచి పోటీ చేస్తారని కొంతమంది, హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారని మరి కొంతమంది అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉదయభాను విజయం సాధిస్తారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి