ఆవుపేడతో వెనీలా పరిమళం

14 Sep, 2015 23:01 IST|Sakshi
ఆవుపేడతో వెనీలా పరిమళం

పరిపరి శోధన
 
గోమయాన్ని... అనగా ఆవుపేడను మనదేశంలో పవిత్ర పదార్థంగా భావిస్తారు. అందువల్ల మనదేశంలో దీనికి ఎనలేని డిమాండ్ ఉంది. ఇతర దేశాల వారు దీనిని పెద్దగా పట్టించుకోరు. వారికి ఏ పేడ అయినా ఒకటే! అయితే, జపాన్‌లోని ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ పరిశోధకులు మాత్రం ఆవుపేడపై నానా పరిశోధనలు సాగించి, దాని నుంచి ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులు వంటివాటికి రుచి కలిగించే వెనీలా పరిమళాన్ని పుట్టించారు.

నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పీడనకు గురిచేస్తే ఆవుపేడ నుంచి వెనీలా పరిమళం పుడుతుందనే మహత్తర విషయాన్ని లోకానికి చాటారు. ఆవుపేడ నుంచి పుట్టించిన ఈ పరిమళంతో మసాచుసెట్స్‌లోని ఒక కంపెనీ ఐస్‌క్రీముల తయారీ కూడా ప్రారంభించడం విశేషం.
 
 

మరిన్ని వార్తలు