'టీడీపీ ఓటమిని అంగీకరించినట్టుగా ఉంది'

7 May, 2014 12:19 IST|Sakshi
'టీడీపీ ఓటమిని అంగీకరించినట్టుగా ఉంది'

హైదరాబాద్: ఓటింగ్ పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ ఓటమి అంగీకరించినట్లుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ నిరాధార ఆరోపణలు చేస్తూ టీడీపీ ఓటమిని  ఒప్పుకుందని చెప్పడానికి నిదర్శనమన్నారు.

 

విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నది టీడీపీయేనని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు కుడి, ఎడమగా నిలుచుంది లిక్కర్ సిండికేట్లనని, లిక్కర్ మాఫియా చంద్రబాబుకు నీడలా ఉందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు చంద్రబాబుకు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు.

 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు