అప్పుడే... నీటి గోస

27 Mar, 2014 04:45 IST|Sakshi

 సాక్షి,మహబూబ్‌నగర్: వేసవిలో మండుతున్న ఎండల తో.. పల్లె ప్రజల గొంతెండుతోంది. మహిళలు తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 203 గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూ పం దాల్చింది. వడ్డేపల్లి,గద్వాల,అయిజ,మల్దకల్, వెలదండ. లింగాల మండలాలలోని పన్నెండు గ్రామాల వారికి అధికారయంత్రాంగం టాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోంది.
 
 ఎండలు మరింత ముదిరితే  నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 203 గ్రామాలకు టాంకర్ల ద్వారా అందించాల్సి వస్తుందన్న  అంచనాతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 14,853 చేతిపంపులు ఉండగా.ఇందులో2,396  వట్టి పోయాయి. మరో 1,750 చేతిపంపులు మరమ్మతులోఉన్నాయి.జిల్లాలో  మంచి నీటి పథకాలు 3,567 ఉండగా ..ఇందు లో 756  పథకాల ద్వారా మంచినీటి స రఫరా అరకొరగా సాగుతోందని అధికారవర్గాలే అంటున్నాయి. ఫ్లోరైడ్ ప్రభావిత మైనవిగా 312 గ్రామాలను  గుర్తిం చిన అధికారగణం ప్రత్యామ్నాయ మా ర్గాలను అన్వేషించే పనిలో పడింది. జిల్లా కేంద్రంతో పాటు అధిక ప్రాంతా ల్లో  ఉప్పు నీరు లభించటం వల్ల  మహిళలు మంచినీటి ఇబ్బందులు తప్పటం లేదు.
 
 ఈ కారణంగానే ప్రజలు మం చినీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో జిల్లాలో  ఏటా  మంచినీటి  వ్యాపారం రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు సాగుతున్నట్లు  లెక్కలు చెబుతున్నాయి. ఏటా వేసవిలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతున్నప్పటికీ పట్టించుకున్న వారే కరువయ్యారు.దీంతో ప్రజలు  ముఖ్యంగా మహిళలు మంచి నీటికోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది.ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే మంచినీటి సమస్య ఇలా ఉంటే  ఎండలు మండే  మే మాసంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని  ప్రజలు అంధోళన చెందుతున్నారు.
 
 గ్రామాల్లో గోస....
 మాజీ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గద్వాల నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. గద్వాల మండలంలోని ఏడు గ్రామాలు,మల్ధకల్‌లో 7, ధరూర్‌లో 8, గట్టు మండలంలోని 7 గ్రామాల్లో  ప్రజ లు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మక్తల్ నియోజకవర్గాల్లో 30 గ్రామాల్లో మంచినీటి కోసం మహిళలు నానా పాట్లు పడుతున్నారు.ఇదే పరిస్థితి నారాయణపేట,కొడంగల్,షాద్‌నగర్,దేవరకద్ర,వనపర్తి,నాగర్ కర్నూల్,కొల్లాపూర్, అచ్చంపేట,అలంపూర్,జడ్చర్ల నియోజకవర్గాల్లోనెలకొని ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పరిస్థితి ఇదే.
 
 మున్సిపాలిటీల్లో నాలుగైదు రోజులకోమారు కూడా  పంపుల ద్వారా మంచినీటిని సరఫరా చేయకపోవటంతో ప్రైవేట్‌గా కోనుగోలు చేయా ల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.  ఎన్నికల సీజన్ కావటం తో ప్రజాప్రతినిధులు,పార్టీలు ప్రచార పర్వంలో తేలియాడుతుండగా... అధికా ర యంత్రాంగం కూడా ఏర్పాట్ల  బిజీలో మునిగి పోయింది. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి గోసను పట్టించుకున్న వారే లేరు. దీనితో నీటి వ్యాపారులు విజృంభిస్తున్నారు.  జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే  స్పందించి ప్రజల దప్పిక తీర్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
 
 నీటి ఎద్దడి నివారణకు
 రూ. 4.71 కోట్లు.  
 నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని  నివారణ కోసం ప్రభుత్వానికి జిల్లా అధికారయంత్రాంగం  రూ.4.71 కోట్ల నిధులు మంజూరు  చేయాలని కోరుతూ  ప్రతి పాదనలు నివేదించింది..ఈ నిధులతో వేసవిలో  నీటి ఎద్దడి తీవ్ర తరం కాను న్న  203 గ్రామాలకు టాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నట్టు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు.ప్రస్తుతం 12 గ్రామాలకు టాంకర్లతో  నీటిని సరఫరా చేస్తున్నామని వివరించింది. మరో 209 గ్రామాల్లో  మంచినీటి కోసం  295 ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవాల్సిన అవసరాన్ని పేర్కోంది. జిల్లాలో  271 బోర్లను క్రషింగ్ చేయటంతో పాటు,242 బోరు బావుల లోతును పెంచాల్సిఉంటుందని ఆ ప్రతిపాదనలలో అధికారులు నివేదించారు
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి