త్యాగశీలి మా ఆవిడ.

21 Feb, 2015 23:01 IST|Sakshi
త్యాగశీలి మా ఆవిడ.

అర్ధాంగి  జీవన సహచరి-6
 
నా భార్య పేరు సౌదామిని. మాకు ఒక కుమార్తె. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నందున అమ్మాయి ఒక్కతే చాలు అంటే కుటుంబ నియంత్రణ చేయించుకున్న త్యాగశీలి మా ఆవిడ. మేమిద్దరం చదువుకున్న నిరుద్యోగులం కాబట్టి చదువు విలువ తెలుసు కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా పాపను మంచి చదువు చదివించాలని నాకంటే తనకే ప్రతి విషయంలోనూ ప్రాధాన్యం ఇస్తుంది.    ఆరేళ్ల క్రితం రెండు ప్రాణాంతక వ్యాధుల నుంచి ఆమె కోలుకుంది. మొదట గుండె ఆపరేషన్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో జరిగింది. అది పూర్తిగా మానకముందే మరొక ఉపద్రవం గొంతు క్యాన్సర్ రూపంలో వచ్చి ఆమెను ఛిన్నాభిన్నం చేసింది. మాకు దేవుడు ఎందుకు ఇంత శిక్ష విధించాడని ప్రతిరోజూ బాధపడేవాళ్లం.

కాని ఆమె వీటన్నింటిని జయించి, మా కోసమే... మేము ఏమైపోతామో నని రేయింబవళ్లు కళ్లలో ఒత్తులు వేసుకుని తను జీవిస్తూ మమ్మల్ని జీవించేలా చేస్తోంది. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని నేను కచ్చితంగా చెప్పగలను. ఒక మామూలు స్త్రీ తన కుటుంబం కోసం ఇంతకన్నా ఏం చేయగలదు. ఆమె చల్లగా ఉండాలని, మాతో చిరకాలం ఉండాలని దేవుడ్ని వేడుకొంటున్నాము.
 మాది పెద్దలు కుదిర్చిన వివాహం అయినా అటు అత్తగారి తరపు నుంచి గాని, పుట్టింటి తరపు నుంచి కాని ఎటువంటి సహాయం, సహకారం లేనప్పటికీ... తిన్నా, తినకపోయినా గుట్టుగా సంసారం ముందుకు నడుపుతున్న నా భార్య అంటే నాకు, నా కూతురికి చాలా ఇష్టం. దేవుడు ఆమెకు నిండు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

 - బి. శ్రీనివాసులు,
  పోరుమామిళ్ల, కడప   సౌదామిని
 
 

 

మరిన్ని వార్తలు