పడతులే ప్రధానం

22 Mar, 2014 04:10 IST|Sakshi
పడతులే ప్రధానం

ఏలూరు, న్యూస్‌లైన్ :
జిల్లాలోని మునిసిపాలిటీల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యత. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో 145 వార్డులు/డివిజన్లలో అందలం ఎక్కేదీ అతివలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించటంతో వారికి సమన్యాయం జరగనుంది.
 
జిల్లాలో భీమవరం మినహా ఏలూరు కార్పొరేషన్, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, తణుకు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 17 వేల 234 మంది అధికంగా ఉన్నారు. గతేడాది జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 442 సర్పంచ్, 4,842 మంది వార్డు సభ్యుల పదవులను మహిళలు అలంకరించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు