ఇంకా వారు ‘దేశం’లోనేనా..!

19 Apr, 2014 01:13 IST|Sakshi
ఇంకా వారు ‘దేశం’లోనేనా..!

రాష్ట్రానికి హైటెక్ హంగులు తెచ్చింది తానేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు  గొప్పలు చెప్పుకోని రోజు లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఏకంగా దేశంలోనే సమాచార, సాంకేతిక విప్లవానికి తానే కారణమని అప్పుడు ఇప్పుడని లేకుండా నేటికీ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. కానీ హైటెక్ బాబు సొంత పార్టీ కార్యాలయంలోనే తెగులు పట్టిస్తున్నారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్ ‘్ట్ఛఠజఠఛ్ఛీట్చఝ.ౌటజ’ లో టీడీపీ లీడర్స్ అనే ఆప్షన్‌లోకి వెళితే పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, పార్టీ ముఖ్యనేతల వివరాలుంటాయి.
 
 పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా ఆయా పార్టీల తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారు కూడా పసుపు కండువాలతో పార్టీ వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడం గమనార్హం. రెండు నెలల క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ పేరు కూడా జాబితాలో ఫొటోసహా ఉంది. 2009లో టీడీపీ తెలంగాణ ప్రాంతంలో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 19 మంది వేరే పార్టీల తీర్థం తీసేసుకున్నారు. పార్టీలో మిగిలింది 21 మందే! కానీ టీడీపీ వెబ్‌సైట్‌లో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చూపుతోంది. టీఆర్‌ఎస్ నుంచి పోటీచేస్తున్న సుమన్ రాథోడ్ టీడీపీ ఖానాపూర్ ఎమ్మెల్యేనని జాబితాలో ఉంది. రెండు నెలల క్రిత మే టీఆర్‌ఎస్‌లో చేరిన బోథ్ ఎమ్మెల్యే గోడం న గేష్, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, టీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు, కె. ఎస్ రత్నం, పి మహేందర్ రెడ్డి, ఎల్కోటి ఎల్లారెడ్డి, జి. జైపాల్ యాదవ్, సత్యవతిరాథోడ్, ఊకే అబ్బయ్యలను టీడీపీ ఎమ్మెల్యేలుగానే వెబ్‌సైట్‌లో పేర్కొంటున్నారు.  విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు చెవిలో పువ్వు పెట్టేందుకో, లేక ఆ పార్టీ ఐటీ శాఖ నిద్రాణంలో ఉందో..     
 -న్యూస్‌లైన్, హైదరాబాద్
 

>
మరిన్ని వార్తలు