ఆత్మీయ ఆదరణ

25 Mar, 2014 04:23 IST|Sakshi
ఆత్మీయ ఆదరణ

‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహానేత తనయ, జననేత సోదరి షర్మిలను ప్రజలు ఆప్యాయంగా ఆదరించారు. ఆత్మీయ బంధువు ఇంటి ముంగిట కొచ్చారని సంబరపడ్డారు. తెనాలి, సత్తెనపల్లి,పిడుగురాళ్లలో షర్మిల ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు భరోసానిస్తూ కరతాళధ్వనులు చేశారు.

 

సాక్షి , గుంటూరు: ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా ప్రజలు ఆమెను ఆప్యాయంగా ఆదరించారు.

రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని షర్మిల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రేపల్లె, తెనాలి, సత్తెనపల్లి, బెల్లంకొండ, పిడుగురాళ్లలో ఎటువైపు చూసినా జనసందోహం కనిపించింది. షర్మిల   బస్సు యాత్ర సోమవారం రేపల్లెలోప్రారంభమైంది.

ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కూడళ్లలో మహిళలు, విద్యార్థులు, ప్రజలు ఆమెకు పూలతో స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్‌షో పేటేరు మీదుగా వేమూరు చేరుకుంది.వేమూరు నియోజకవర్గం సమన్వకర్త మేరుగ నాగార్జున షర్మిలకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జంపని మీదుగా పెదరావూరు చేరుకొన్న షర్మిల బస్సుయాత్రకు గుంటూరు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తెనాలి నియోజకవర్గం సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారు రోశయ్యలు ఎదురేగి స్వాగతం పలికారు.
 
తెనాలి పట్టణంలో వైకుంఠపురం మీదుగా కొత్తవంతెన, వాహాబ్‌చౌక్, సత్యనారాయణ టాకీస్‌రోడ్డు, బోస్‌రోడ్డు, గాంధీచౌక్, రజకచెరువు సెంటర్ మీదుగా ఐతానగర్ చేరుకొని  లింగారావు సెంటర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. అనంతరం సంగం జాగర్లమూడి మీదుగా వడ్లమూడి వద్ద ఏర్పాటు చేసిన మధ్యాహ్నం బస కేంద్రానికి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 
తెనాలి నుంచి గుంటూరు, నల్లపాడు,పేరేచర్ల, మేడి కొండూరు మీదుగా సత్తెనపల్లి చేరుకున్నారు. సత్తెనపల్లి శివారురులో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి అంబటి రాంబాబు, నియోజకవర్గ నాయకులు ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, గజ్జల నాగభూషణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లంచర్ల సాంబశివరావులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు.

 తాలూకా సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మున్సిపల్ ైచైర్మన్ అభ్యర్థి చల్లంచర్ల సాంబశివరావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షర్మిల అన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
 
అనంతరం అక్కడి నుంచి రెడ్డిగూడెం, రాజుపాలెం మీదుగా బెల్లంకొండ చేరుకున్న ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బొల్లాబ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, బెల్లంకొండ జెడ్పీటీసీ అభ్యర్థి దేవెళ్ళ రేవతి, ఎంపీటీసీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డిలను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం అనుపాలెం, కొండమోడు మీదుగా పిడుగురాళ్లకు చేరుకున్నారు.

పోటెత్తిన పల్నాడు... రాజన్న తనయ షర్మిలను  చూసేందుకు పల్నాడు ప్రజలు పోటెత్తారు. ఆమెకు పూలతో స్వాగతం పలికారు. యువకులు, కార్యకర్తలు, నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.గురజాల అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు.

బాణాసంచా కాలుస్తూ అడుగడుగునా స్వాగతం పలికారు. గురజాల అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి, పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి రేపాల రమాదేవిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
 
గెలిచే దమ్ములేకే...
పొత్తుల కోసం బాబు ఆరాటంవెఎస్సార్ సీపీ నేత బాలశౌరి ధ్వజం

తెనాలిరూరల్, న్యూస్‌లైన్: సొంతగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేకే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని, ఆ పార్టీకి అభ్యర్థులు సైతం కరువయ్యారని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకులు వల్లభనేని బాలశౌరి విమర్శించారు.స్థానిక ఐతానగర్‌లోని లింగారావు సెంటరులో వెఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
 
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనానికి బెదిరి టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ఏర్పడి పొటీ చేసినా వైఎస్‌ను నిరోధించలేకపోయారన్నారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి భయంతోనే చంద్రబాబు బీజేపీ, ఇతర పార్టీలతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు.
   
జగన్ సీఎం కావడం తథ్యం
వైఎస్సార్ సీపీ నేత ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి  

సత్తెనపల్లి, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని  నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు.పట్టణంలోని తాలూకా సెంటర్‌లో సోమవారం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిం చడం తథ్యమని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత వరుస ఎన్నికలు ఇంత వరకు ఎప్పుడూ జరగలేదనీ, అన్ని రకాల ఎన్నికలు రెండునెలల్లో జరుగుతున్నాయనీ, అన్ని శక్తులను ఓడించి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జనం కరతాళధ్వనుల మధ్య చెప్పారు.

>
మరిన్ని వార్తలు