విజయనాదం

26 Mar, 2014 00:58 IST|Sakshi
‘వైఎస్సార్ జనభేరి’

సాక్షి, ఏలూరు : ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల శంఖారావంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ సెంటర్‌లో జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిం చారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రూ.65 వేల కోట్ల రుణమాఫీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.25 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి. వీటన్నిటినీ బాబు మాఫీ చేయించగలడా’ అని విజయమ్మ ప్రశ్నించారు. ‘ఎన్ని కల్లో గెలిపిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాడంట. రాష్ట్ర ప్రజల కోసమే ఒకనాడు సీఎం పదవిని త్యాగం చేశాడంట. ఎవరయ్యా నీకు సీఎం పదవి ఇస్తానంది’ అని ప్రశ్నించారు.

 బాబు హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిందని, 23వేల మంది ఉద్యోగు లు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. వ్యవస్థను, మీడియా ను మేనేజ్ చేయడంలో సమర్థుడైన బాబు అన్ని రం గాలనూ నిర్వీర్యం చేశారన్నారు. రెండే రెండు ఫ్లై ఓవ ర్లు, ఓ హైటెక్ సిటీ భవనాన్ని కట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ఆయనకే చెల్లిందని విమర్శిం చారు. ఆయన హయాంలో రాష్ట్రానికి రూ.55 వేల కోట్ల అప్పుల భారం మిగిలిందన్నారు. బీసీలను అన్నివిధాలా అణగదొక్కిన బాబు అధికారం కోసం తెలంగాణలో బీసీలను సీఎం చేస్తానని కొత్త పల్లవి అం దుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.


 మరోసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు ప్రజలకు మోసపూరిత మైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పేదలు తినడానికి తిండి లేక, తాగడానికి నీరులేక అనేక ఇబ్బం దులకు గురయ్యారన్నారు .రాష్ట్రంలో కరువు తాండవం చేస్తే కనీసం రైతులను ఆదుకునే దిక్కులేని పరిస్థితి నెల కొందన్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వారిని జైల్లో పెట్టించేందుకు పూనుకున్నారన్నారు. రైతులు దొరక్కపోతే వారి భార్యలను జైల్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి లాంటి నయవంచకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

 జగన్‌బాబును ఆశీర్వదించండి

 రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది.. జనరంజకమైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని విజయమ్మ కోరారు. ఆయన సీఎం అయితే పోల వరం, చింతలపూడి ఎత్తిపోతల పథ కాలు పూర్తి కావడం ఖాయమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

 వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని గెలిపించండి

 జంగారెడ్డిగూడెం : మునిసిపల్, అసెం బ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ కోరారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాల రాజేష్, జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్ అభ్యర్థి తల్లాడి వరలక్ష్మిలతోపాటు అన్ని వార్డుల అభ్యర్థులనూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయమ్మ కోరారు.

 రాత్రి 10 గంటలైనా...

 కాగా రోడ్‌షో ఆలస్యమైనా అభిమానులు వేల సంఖ్యలో ఎదురుచూడటం విశేషం. తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చిన మహానేత సతీమణి వైఎస్ విజయమ్మను చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. విజయమ్మ ప్రసంగిస్తున్న సమయంలో జగన్ నినాదాలతో బోసుబొమ్మ సెంటర్ దద్దరిల్లింది. జోహార్ వైఎస్సార్ అంటూ కార్యకర్తల నినాదాలు పట్టణ నలుమూలలకు పాకింది.

యువతను చూసిన విజ యమ్మ రేపటి మార్పునకు మీరే ఆయుధాలని, ఓటుతో యుద్ధం చేసి వైఎస్సార్ సీపీని గెలిపించి అభివృద్దికి బాటలు వేయాలని కోరారు. విజయమ్మ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు