బలహీనవర్గాలకు అండ - వైఎస్‌ఆర్ సీపీ జెండా

31 Mar, 2014 02:03 IST|Sakshi

నందిగాం, న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుందని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆది వారం కొండల ప్రాంతంలోని సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ఆమె ప్రసంగానికి ప్రజలు నీరాజనం పట్టారు. ఓ వైపు ప్రచండమైన ఎండ, ఉక్కపోత, వేడిమిని సైతం తట్టుకొని ప్రజలు నీరాజనం పట్టారు.
 
తొలుత రాంపురంలో అడుగుపెట్టిన శాంతి కొండల ప్రాంతానికి శివారున ఉన్న దిమ్మిడిజోల, దీనబందుపురం గ్రామాల వరకు నిరాటంకంగా పర్యటించింది. పెద్దతామరాపల్లి గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉండాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
 
రైతులకు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది రాజశేఖర్‌రెడ్డి మాత్రమే అని, మళ్లీ అవి కొనసాగిస్తూ మరికొన్ని పథకాలు జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రవేశ పెడతారని భరోసా ఇచ్చారు. టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు ఇస్తున్న నెరవేర్చలేని హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ తుడుచుకుపోతుందన్నారు.
 
కర్లపూడి, నౌగాం, కల్లాడ, మదనాపురం, అన్నాపురం, దిమ్మిడిజోల, హర్షబాడ, దీనబందుపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో కింతల ధర్మారావు, చింతాడ మంజు, యర్రా చక్రవర్తి, పోలాకి మోహన్, తమిరె వివేకానంద, దేవేంద్ర, తమిరె బలరాం, పోలాకి సాంభమూర్తి, చిరంజీవులు, పుష్యా సత్యం, జీరు నానిరెడ్డి, నడుపూరి శ్రీరామ్మూర్తి, కొల్లి శ్రీరాములు పాల్గొన్నారు.
 
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
రెడ్డి శాంతి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామితోపాటు రాంపురం గ్రామస్తులు పలువురు పార్టీలో చేరారు. అలాగే గొల్లూరు మాజీ సర్పంచి జీరు నానిరెడ్డి, ప్రస్తుత ఉపసర్పంచ్ రట్టి ఈశ్వరరావుతోపాటు మరికొందు పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు