వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వేటకొడవళ్లతో దాడి

7 May, 2014 15:02 IST|Sakshi

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు వేట కొడవళ్లతో దాడులు చేశారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో ఓటింగ్ జరుగుతున్న తీరు తమకు అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

బుక్కరాయసముద్రం మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ నాయకులు వేటకొడవళ్లతో దాడి చేయడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కార్యకర్తలను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. మరోవైపు ఇదే జిల్లా రామగిరి మండలం పోలేపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దీంతో అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా