ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్–సీఆర్పీ ఆర్ఆర్బీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 10,190
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)– 5249
2. ఆఫీసర్ స్కేల్ –ఐ (అసిస్టెంట్ మేనేజర్)– 3312
3. ఆఫీసర్ స్కేల్– ఐఐ (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు) – 1208.
4. ఆఫీసర్ స్కేల్–ఐఐ (స్పెషలిస్ట్ ఆఫీసర్, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఐటీ, అగ్రి కల్చర్ మేనేజర్)– 261.
5. ఆఫీసర్ స్కేల్– ఐఐఐ (సీనియర్ మేనేజర్)– 160
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. ఠి వయసు: 21– 40 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్షలను ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–ఐ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ అనే రెండు అంచెలతో కూడిన రాత పరీక్ష ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–ఐఐ, ఆఫీసర్ స్కేల్–ఐఐఐ పోస్టులకు ఒకే రాత పరీక్ష (సింగిల్ లెవల్ ఎగ్జామినేషన్) ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in,
www.sakshieducation.com/Banks/Index.html,
www.sakshieducation.com/Home.html చూడగలరు