‘నేహను క్షమాపణలు కోరుతున్నా’

7 Dec, 2019 18:29 IST|Sakshi

‘దిల్‌బర్‌’ సింగర్‌ ఫేమ్‌, ఇండియన్‌ ఐడల్‌ షో జడ్జి నేహా కక్కర్‌ ఎత్తు, టాలెంట్‌పై విమర్శలు చేసిన కమెడియన్‌ గౌరవ్‌ గేరా క్షమాపణలు చెప్పాడు. ఓ కామెడీ షోలో భాగంగా పొట్టిగా ఉన్న అమ్మాయిని నేహా కక్కర్‌గా పేర్కొన్న గౌరవ్‌... నేహా పాడిన పాటలను సైతం ప్రస్తావించాడు. ఈ విషయంపై నేహా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గౌరవ్‌ మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలకు నేహా ఈ స్థాయిలో బాధపడుతుందని ఊహించలేదన్నాడు. తాను నేహకు పెద్ద అభిమానినని, ఆమె ఒక గొప్ప ప్రతిభావంతురాలని కొనియాడాడు. నేహ టాలెంట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ప్రశంసలు కురిపించాడు.

అదే విధంగా ఆమె టాలెంట్‌ను అంచనా వేసే స్థాయి కూడా తనకు లేదని వ్యాఖ్యానించాడు. నేహా టాలెంట్‌.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ను చూస్తే అర్థమవుతుందన్నాడు. 3 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారని తెలిపాడు. కాగా నేహాను కించపరుస్తున్నట్లుగా గౌరవ్‌ మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియోను పోస్ట్‌ చేసిన చానెల్‌ వెంటనే తొలగించినప్పటికీ నేహా అభిమానుల అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గౌరవ్‌ వివరణ ఇచ్చుకున్నాడు. నేహా దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చిందని తెలిపారు. తాను అసలు ఎత్తు గురించి పట్టించుకోనని.. అసలు తన ఎత్తు కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు.  

Read latest Entertainment News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా