వీరి రెమ్యూనరేషన్‌ ఎంతంటే..

20 Oct, 2017 08:56 IST|Sakshi

సాక్షి,ముంబయి: బాలీవుడ్‌ యువ హీరోలు ఒక్కో సినిమాకు భారీగా ఛార్జ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ మార్కెట్‌ పరిథి భారీగా విస్తరించడంతో ఒకటి రెండు హిట్లు పడిన క్రేజీ హీరోకు పెద్దమొత్తంలో ఆఫర్‌ చేస్తున్నారు. స్టార్‌డమ్‌ ఆధారంగా యువ హీరోలు భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు. ఒక్క హిట్‌ పడితే మాత్రం రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేస్తున్నారు. బాలీవుడ్‌ యువ హీరోల్లో సినిమాకు రూ 18 కోట్లు వరకూ తీసుకుంటూ రణబీర్‌ కపూర్‌ అ‍గ్రస్ధానంలో నిలిచారు. రణబీర్‌ గత చిత్రాలు పెద్దగా ఆడకపోయినా ఇతర యువ హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్నారు. ఇక సంజయ్‌ దత్‌ బయోపిక్‌కు మాత్రం నిర్మాతలతో లాభాలు పంచుకునే ఒప్పందానికి అంగీకరించడంతో తక్కువ రెమ్యూనరేషన్‌తో సరిపెట్టుకున్నారు. 


వరుణ్‌ ధావన్‌
బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌గా సత్తా చాటుతున్న వరుణ్‌ ధావన్‌ ప్రొడ్యూసర్లకు హాట్‌ హీరో అయ్యారు. జుడ్వా 2 ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్ల మార్క్‌ను చేరుకోవడంతో వరుణ్‌ మార్కెట్‌ సైతం విస్తరించింది. వరుణ్‌ ప్రస్తుతం సినిమాకు 12 నుంచి 15 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నాడు. అనుష్క శర్మతో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించే మూవీకి మాత్రం మరింత ఎక్కువగా చార్జ్‌ చేశాడు


షాహిద్‌ కపూర్‌
2017లో ఇప్పటివరకూ ఒక్క హిట్‌ పలుకరించని షాహిద్‌ కపూర్‌ భారీ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది మాత్రం షాహిద్‌కు బాగానే కలిసివచ్చింది. అయితే ప్రస్తుతం షాహిద్‌ ఆశలన్నీప్రతిష్ఠాత్మక చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిపైనే ఉన్నాయి. 15 ఏళ్ల నుంచి ఇండస్ర్టీలో ఉన్న షాహిద్‌ కపూర్‌ సినిమాకు రూ 10 నుంచి 12 కోట్ల వరకూ రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.


రణ్‌వీర్‌సింగ్‌
2010లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రణ్‌వీర్‌సింగ్‌ ఏడేళ్లలోనే యూత్‌ ఐకాన్‌గా మారారు. పలు హిట్లతో బాక్సాఫీస్‌ వద్ద చెలరేగిన రణ్‌వీర్‌ ఒక్కో సినిమానకు రూ 10 కోట్ల వరకూ పారితోషికంగా అందుకుంటున్నారు. స్టార్‌డమ్‌ పెరుగుతుండటంతో పలు సినిమాల్లో లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. త్వరలో విడుదల కానున్న పద్మావతి మూవీలోనూ పారితోషికంతో పాటు లాభాల్లో వాటా అందుకోనున్నారు.


సుశాంత్‌ రాజ్‌పుట్‌
టీవీ నటుడిగా సుపరిచితమైన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ సినిమా అరంగేట్రంలోనూ అదరగొట్టారు. బాలీవుడ్‌లో మెల్లిగా తనకంటూ మార్కెట్‌ క్రియేట్‌ చేసుకుంటున్న ఈ యువహీరో ఒక్కో సినిమాకు రూ 5 నుంచి 7 కోట్ల వరకూ అందుకుంటున్నారు. 


అర్జున్‌ కపూర్‌
బాలీవుడ్‌పై కపూర్‌ల ముద్ర కాదనలేనిది. ఇష్కజాదేతో ఐదేళ్ల కిందట బాలీవుడ్‌లో సత్తా చాటిన అర్జున్‌ కపూర్‌ ఇప్పుడు సినిమాకు రూ 5 నుంచి 7 కోట్లు చార్జ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో చేతిలో అర్జున్‌ ఔర్‌ పింకీ ఫరార్‌, నమస్తే కెనడా వంటి చిత్రాలున్నాయి.


టైగర్‌ ష్రాఫ్‌
జాకీ ష్రాఫ్‌ తనయుడిగా అదిరిపోయే అరంగేట్రం ఇచ్చిన టైగర్‌ ష్రాఫ్‌ తన సత్తా చాటుకునే పనిలో పడ్డారు. వరుసగా రెండో సినిమా సక్సెస్‌ అయినా బాలీవుడ్‌పై తనదైన ముద్ర వేయడంలో తడబడుతున్న టైగర్‌ ష్రాఫ్‌ మంచి సక్సెస్‌ కోసం తహతహలాడుతున్నారు. టైగర్‌ గత రెండు సినిమాలు ఫ్లైయింగ్‌ జాట్‌, మున్నా మైఖేల్‌లు ఆశించిన విజయం దక్కించుకోలేకపోయాయి. ప్రస్తుతం సినిమాకు టైగర్‌ ష్రాఫ్‌ రూ 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. బాగి 2 మూవీకి టైగర్‌ ష్రాఫ్‌ ఏకంగా రూ 7 కోట్లు చార్జ్‌ చేయడంతో ష్రాఫ్‌ గ్రాఫ్‌ పెరుగుతోందని ట్రేడ్‌ పండితులు పేర్కొన్నారు.

Read latest Entertainment News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా