‘బ్యాటిల్‌ విత్‌ బాటిల్‌’ 

22 Oct, 2017 12:11 IST|Sakshi

సాక్షి,ముంబయి:మద్యం వ్యసనం మనిషిని ఎంతలా పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ మత్తుకు చిత్తయిన వారే. తాజాగా మద్యంతో తాను చేసిన పోరాటాన్ని కళ్లకు కడుతూ బాలీవుడ్‌ నటి, పిల్మ్‌ మేకర్‌ పూజాభట్‌ బ్యాటిల్‌ విత్‌ బాటిల్‌ పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ పుస్తకం మార్కెట్‌లోకి రానుంది. అయితే ఇది తన ఆటోబయోగ్రఫీ కాదని, 44 ఏళ్ల వయసులోనే తన జ్ఞాపకాలను నిక్షిప్తం చేసేంత వయను తనకు లేదని పూజా భట్‌ చెప్పుకొచ్చారు.

పూజా లిక్కర్‌ అలవాటును మానుకుని పది నెలలవుతోంది. తన జీవితంలో ఆల్కహాల్ ప్రభావం, దానితో తన ప్రయాణాన్ని తెలుపుతూ ఇతరులకు వారి సమస్యను అధిగమించడంలో సహాయ పడతానని చెప్పారు.మద్యం అలవాటు మానుకోవడం ఏమంత కష్టం కాదని, అంత సులువూ కాదని పూజ చెప్పారు. రోష్మిలా భట్టాచార్య సహ రచయితగా పూజా భట్‌ ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. తాను ఆల్కహాల్‌ను ఇప్పుడు వదిలించుకోకుంటే అది తనను కబళిస్తుందని పూజ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు