‘ఆ బంధాలు సునిశితం’

18 Oct, 2017 09:21 IST|Sakshi

సాక్షి,ముంబయి: రొమాంటిక్‌ అనుబంధాలు సునిశితమైనవని, భాగస్వామి విజయాలు, అభిరుచులను అర్థం చేసుకునే వారు దొరకడం కష్టమని బాలీవుడ్‌ భామ దీపికా పడుకోన్‌ అన్నారు.ఇండస్ర్టీలో నెంబర్‌ వన్‌ స్ధానాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదన్నారు. కాలంతో్ పాటు తన వ్యక్తిగత బాంధవ్యాలు కొన్ని బలపడ్డాయని, అయితే ఈ ప్రయాణంలో కొందరు స్నేహితులు తనకు దూరమయ్యారని చెప్పారు. స్కూలు స్నేహితులు కొందరితో తానిప్పటికీ టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చారు. కొందరు తనకు వచ్చిన విజయాలతో తనను సరిగ్గా బేరీజు వేయలేక దూరమయ్యారని, వీటిని జీవితంలో భాగంగానే తాను చూశానని, తనను అర్ధం చేసుకున్న వారు మాత్రం తనతోనే ఉన్నారని దీపికా అన్నారు.

హేమమాలిని బయోగ్రఫీ ‘హేమమాలి: బియాండ్‌ ది డ్రీమ్‌ గర్ల్‌’ ఆవిష్కరణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్‌డమ్‌, త్యాగం ఒకదాని వెంట ఒకటి ఉంటాయని, తమ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు అంకిత భావంతో ముందుకెళ్లాలని అన్నారు. తాను కాలేజ్‌కు వెళ్లలేకపోయాయని, కేవలం ఇంటర్‌ మాత్రమే పూర్తిచేయగలిగానని కెరీర్‌ తొలినాళ్ల గురించి గుర్తుచేసుకున్నారు. మోడల్‌గా బిజీగా ఉండటంతో బెంగుళూర్‌ నుంచి తరచూ ఢిల్లీ, ముంబయి వెళ్లాల్సివచ్చేదన్నారు. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తిచేద్దామని ప్రయత్నించినా కుదరలేదని, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్ కూడా వర్కవుట్‌ కాలేదన్నారు. దీంతో తన చదువుపై తల్లితండ్రుల నుంచి బోలెడు ఫిర్యాదులు ఎదురయ్యేవని అన్నారు.
 

Read latest Entertainment News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు