ఆన్‌లైన్‌.. మ్యూజిక్‌!

16 Sep, 2018 08:28 IST|Sakshi

ఇవీనగర‡ యువతను సేదదీర్చే వ్యాపకాలు..

ఖాళీ సమయంలో వారానికి 4 గంటలకు పైగా ఆన్‌లైన్‌లోనే

చదువులో ప్రతిరోజూ సేదదీరుతున్న వారు 58 శాతం

ఖాళీసమయాల్లో ఏం చేస్తారు..? ఈ ప్రశ్న అడగ్గానే చాలా మంది నేటి తరం యువత చెప్పే సమాధానం ఒకటే.. అది ఆన్‌లైన్‌లో గడిపేయడం.. ఇది అక్షరాలా సత్యం. ఇదే విషయాన్ని యువ్‌గవ్‌–మింట్‌ మిలీనియల్‌ సర్వే చెబుతోంది. నగర యువతీ యువకులపై జరిపిన అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నగరాల్లో సగానికి పైగా యువతీయువకులు ఇంటర్‌నెట్‌ లేదా సోషల్‌ మీడియాతో సేదదీరుతున్నారు.. ప్రతి వారందొరికిన ఖాళీ సమయంలో కనీసం 4గంటలు సోషల్‌ మీడియాలోనో.. నెట్‌లోనో మునిగిపోతున్నారట.

ఔట్‌డోర్‌ గేమ్స్‌ లేదా జిమ్‌/జాగింగ్‌/యోగ తదితర ఫిట్‌నెస్‌ కార్యకలాపాల కంటే ఆన్‌లైన్‌కే యువత అధిక ప్రాధాన్యంఇస్తున్నట్లు స్పష్టమైంది. 1981–96 మధ్య పుట్టిన(22–37 వయోశ్రేణిని మిలీనియల్స్‌గా వ్యవహరిస్తారు) 1996 తర్వాత పుట్టిన (వీరిని జనరేషన్‌ జడ్‌/జన్‌ జర్స్‌ అంటారు) యువత జీవన శైలిపై ఈ సర్వేలో పరిశీలన జరిపారు. 180 నగరాలపై జరిపిన ఈ ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం– వారంలో కనీసం ఒక గంటైనా ఔట్‌డోర్‌ ఫిటినెస్‌ వ్యాపకాల్లో గడిపే యువత సగానికంటే తక్కువే.. అయితే కళలతో పోల్చుకున్నప్పుడు ఆటలు/ఫిట్‌నెస్‌ కార్యకలాపాలకు వీరు ప్రాధాన్యంఇస్తున్నారు.

ఖాళీ సమయంలో చదువుకోవడానికి ఈ రెండు గ్రూపుల యువతీ యువకులూ ఆసక్తి కనబరుస్తున్నారు. 58శాతం మంది ప్రతి రోజూ చదువుకుంటామని చెబుతున్నారు.వినోదం కోసం ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తున్న యువత సంఖ్య పెరుగుతోంది. ‘జన్‌ జర్స్‌’లో అత్యధికులు కేబుల్‌ టీవీ చూసేందుకు ఇష్టపడట్లేదు. నెట్‌ఫ్లిక్స్‌ లేదా హాట్‌స్టార్‌ వంటి వాటిపై ఆసక్తిగా ఉన్నారు. మిలీనియల్స్, జన్‌ జర్స్‌లో 15 శాతం మంది మాత్రమే రోజూ ఏదో ఒక సంగీత వాయిద్యంతో సేదదీరుతున్నారట.. 20 శాతం మందే కళల మధ్య గడుపుతున్నారట.

ఆదాయం ఉంటేనే అభిరుచి..

  • ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకుల్లో ఏదో ఒక అభిరుచి (కళలు, ఫొటోగ్రఫీ,వంటపని, తోటపని, సంగీతం) ఉన్నవారు 63 శాతం మంది. విద్యార్థుల్లో 54 శాతం మంది ఈ అభిరుచులకు సమయంకేటాయిస్తున్నారు.
  •  అభిరుచులను, సరదాలను కుటుంబ ఆదాయం కొంతమేరకు ప్రభావితం చేస్తోంది. ఇతరులతో పోల్చుకుంటే.. సంపన్న కుటుంబాలకు చెందిన యువతీయువకులు తమ అభిరుచులకు మరింత సమయం వెచ్చించగలుగుతున్నారు. రూ.20 వేలు సంపాదిస్తున్న వారిలో 45 శాతం మంది, రూ. 20–50 వేలు సంపాదిస్తున్న వారిలో 40 శాతం మంది తమ అభిరుచుల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. రూ.50వేలకు పైగా సంపాదించే యువతీయువకుల్లో 33 శాతం మినహా మిగిలిన వారు అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. తోటపని వంటి కళల మధ్య గడుపుతున్న వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ.

Read latest Entertainment News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు