1 నవంబర్,1800 వైట్‌హౌస్ ప్రవేశం!

1 Nov, 2015 02:55 IST|Sakshi
1 నవంబర్,1800 వైట్‌హౌస్ ప్రవేశం!

ఆ  నేడు
అమెరికా అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ తన నివాసాన్ని తొలిసారిగా వైట్‌హౌస్‌లోకి మార్చారు. అంతకు ముందు వరకు అమెరికా అధ్యక్షుని నివాసం ఫిలడెల్ఫియాలోని మార్కెట్ స్ట్రీట్ మ్యాన్షన్‌లో ఉండేది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ , పెన్సిల్వేనియాలో (వాషింగ్టన్) ఎంపిక చేసిన స్థలంలో 1792లో కట్టడం మొదలు పెట్టారు. రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ హయాం లో పూర్తయింది. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా. వైట్‌హౌస్‌లో ఉన్న తొలి అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. అప్పటినుంచి అమెరికా అధ్యక్షులందరూ ఇందులోనే నివాసం ఉంటున్నారు.

ప్రస్తుతం వైట్‌హౌస్ అని వ్యవహరిస్తున్న ఈ భవనానికి దాన్ని కట్టాక వందేళ్లకి కానీ ఆ పేరు ఏర్పడలేదు. ఒకసారి అది కాలిపోయిన ప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. దాంతో  ప్రజలు దానిని వైట్‌హౌస్ అని పిలిచేవారు. అయితే అధికారికంగా మాత్రం 1901లో థియోడర్ రూజ్‌వెల్ట్ దీనిని వైట్ హౌస్ అని పిలిచారు. అత్యవసర సమయంలో విధులు నిర్వహించేందుకు వీలుగా దీని భూగర్భంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఓ బంకర్ ఉంది.

మరిన్ని వార్తలు