విద్యుత్‌తో నడిచే గానుగలపై 15 రోజుల శిక్షణ

23 Oct, 2018 04:54 IST|Sakshi

ఆరోగ్య స్పృహతో పాటు గానుగ నూనెలకు గిరాకీ పెరుగుతున్నది. నూనె గింజల నుంచి ఆరోగ్యదాయక పద్ధతిలో వంట నూనెలను గ్రామస్థాయిలోనే ఉత్పత్తి చేయడానికి విద్యుత్‌తో నడిచే గానుగ(పవర్‌ ఘని)లు మంచి సాధనాలు. వీటి నిర్వహణలో మెలకువలపై ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ 16 ఏళ్లు నిండి, కనీసం 8వ తరగతి చదివిన రైతులు, యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. గతంలో నెల రోజులు శిక్షణ ఇచ్చేవారు. తాజాగా 15 రోజుల స్వల్పకాలిక శిక్షణా కోర్సును రూపొందించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గల డా. బీఆర్‌ అంబేడ్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 4,070. ప్రయాణ చార్జీలు అదనం. విద్యుత్‌తో నడిచే గానుగ గంటకు 15 కిలోల గింజల నుంచి నూనెను తీయవచ్చు. 40–45% వరకు నూనె వస్తుంది. శిక్షణ పొందిన వారు సబ్సిడీపై  స్వయం ఉపాధి రుణాలు పొందొచ్చు.  హైదరాబాద్‌లోని ఖాదీ కమిషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎం. హరిని సంప్రదించవచ్చు.. 95335 94597, 040–29704463. 

మరిన్ని వార్తలు