న్యూ ఇయర్‌ స్టెయిల్స్‌

30 Dec, 2018 23:50 IST|Sakshi

►లెహెంగా మీదకు చోలీ, దుపట్టాలు ధరించడం సాధారణమే. కానీ, ఇలా మల్టీపర్పస్‌లో ఉపయోగించే అసెమెట్రికల్‌ కేప్స్‌ వెడ్డింగ్‌ లెహంగాల మీద మరిన్ని హంగులతో కొత్తగా మెరుస్తున్నాయి. లెహంగాల మీదకే కాదు ధోతీ, పలాజో, స్కర్ట్, సిగరెట్‌ ప్యాంట్‌.. ఇలా అన్ని రకాల బాటమ్స్‌కి డిజైనర్‌ కేప్‌ స్టైల్స్‌ ఫ్యాషన్‌కి సరికొత్త భాష్యాన్ని చెబుతున్నాయి. 

►ఫ్లోర్‌ లెంగ్త్‌ కుర్తీల గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ రోజుల్లో. అమ్మాయికే కాకుండా అమ్మకూ అతి ముచ్చటైన డ్రెస్‌గా అమరింది. రాబోయే ఏడాదిలోనూ వీటి హవా కొనసాగుతుందనడానికి వీటిలో వస్తున్న డిజైన్సే సిసలైన ఉదాహరణ. అలాగే లాంగ్‌ కుర్తీల మీదకు లాంగ్‌జాకెట్స్‌ ఇటీవల మరో అదనపు ఆకర్షణగా చేరింది. జరీ జిలుగులతో ఎంబ్రాయిడరీ చేసినవి సంప్రదాయ వేడుకల్లోనూ, హ్యాండ్లూమ్స్‌తో చేసినవి క్యాజువల్‌ వేర్‌గానూ.. ఫ్యాబ్రిక్‌ని బట్టి పార్టీవేర్‌గా రూపం మార్చుకుంటుంది లాంగ్‌ కుర్తీ. 

►ఈ ఏడాది శారీ కట్టులోనూ మార్పులు వచ్చాయి. ధోతీ, ట్రౌజర్‌ వంటివి బేస్‌గా చేసుకొని చీరకట్టులో ప్రత్యేకత చూపించారు. వీటిలో లాంగ్‌ స్లీవ్స్‌తో పాటు బెల్‌ స్లీవ్స్‌ జాకెట్టు చీరకట్టు లుక్‌నే మార్చేసింది. బామ్మలనాటి చీర అయినా బెల్‌ స్లీవ్స్, కేప్‌ బ్లౌజ్‌ల వల్ల లుక్‌ ఆకర్షణీయంగా మారిపోతుంది.  

మరిన్ని వార్తలు