సోలార్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై 4 రోజుల శిక్షణ

7 Aug, 2018 17:18 IST|Sakshi

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లలో 25%, కూరగాయల్లో 30% వరకు వినియోగదారులకు చేరకముందే కుళ్లిపోయి వృథా అవుతున్నాయి. ఈ దుస్థితిని నివారించాలంటే పండ్లు, కూరగాయలను శుద్ధి చేసి, తదనంతరం వినియోగించే రూపంలోకి మార్చాలి. ఈ నేపథ్యంలో సౌరశక్తితో పండ్లు, కూరగాయల శుద్ధిపై రైతులు, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సొసైటీ ఫర్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (సీడ్‌) స్వచ్ఛంద సంస్థ 4 రోజుల శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్‌ 4–7 తేదీల్లో శిక్షణ ఇస్తారు. సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ., ఎన్‌.ఐ.ఎన్‌., పి.జె.టి.ఎస్‌.ఎ.యు., ‘సీడ్‌’ నిపుణులు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. 040–23608892, 23546036, 96526 87495 

మరిన్ని వార్తలు