80 20 రూల్!

26 Apr, 2015 23:17 IST|Sakshi

మానసికం

భార్యాభర్తల సంబంధాలు కూడా ఆర్థికశాస్త్రంలోని ‘80-20’ రూల్‌లాంటివేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. పరెటో ప్రిన్సిపల్ ప్రకారం 80 శాతం కంపెనీ సేల్స్, 20 శాతం ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. అలాగే  80 శాతం కంపెనీ లాభాలు 20 శాతం కస్టమర్ల మీద ఆధారపడి ఉంటాయి. కంపెనీకి వచ్చే 80 శాతం ఫిర్యాదులు 20 శాతం కస్టమర్ల నుంచి వస్తాయి. వైవాహిక బంధంలో కూడా ఇది వర్తిస్తుంది.

వైవాహిక బంధంలోని 80 శాతం కోపతాపాలు, అసంతృప్తులు 20 శాతం సమస్యల వల్లే వస్తున్నాయి. ఆ 20 శాతం సమస్యల మూలాలేమిటో తెలుసుకుంటే... సంసారరథం హ్యాపీగా సాగిపోతుంది.

మరిన్ని వార్తలు