రూపంలో చిన్న.. మేలు చేయడంలో పెద్ద...

23 Nov, 2015 00:47 IST|Sakshi
రూపంలో చిన్న.. మేలు చేయడంలో పెద్ద...

తిండి  గోల
 

వాము భారతీయులకు తెలిసిన అతి ప్రాచీన గొప్ప ఔషధం. దీనిని ఓమ అని కూడా అంటుంటాం. సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసుగా వాడుకలో ఉంది. ఆహారం జీర్ణం కానప్పుడు కాసింత వామును నోట్లో వేసుకోమంటుంటారు పెద్దలు. జీర్ణశక్తికే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్యసమస్యలకు ఔషధంలా వామును ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా వాము సాగు ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో వాము సాగులో ముందంజలో ఉన్నాయి. మన దేశంతో పాటు ఇరాన్, ఆఫ్టనిస్తాన్ దేశాలు వాము వాడకంలోనూ, ఉత్పత్తిలోనూ ముందున్నాయి.

ఆకారానికి జీలకర్రలాగే అనిపించినా పరిమాణంలో చిన్నదిగా ఉండే వాము రుచి కొంచెం ఘాటు, ఇంకొంచెం కారం. రూపంలో చిన్నదైనా వాము చేసే మేలు మాత్రం మహా పెద్దది. మనం ఎంతో ప్రాచీనమైనదిగా చెప్పుకునే వాము మూలాలు ఈజిప్టులో ఉన్నాయని, అక్కడి నుంచి ఇండియాకు అటు తర్వాత ఇతర దేశాలకు విస్తరించిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు