యంగ్ టాగూర్!

22 Jan, 2014 00:21 IST|Sakshi
యంగ్ టాగూర్!

 బుక్ షెల్ఫ్
 బాల్యంలాగే  యవ్వనానికి విలువైన జ్ఞాపకాలు ఉంటాయి. విశ్వకవి రవీంద్రుడు తన యవ్వనంలో ఎలా ఉండేవాడు? అందరిలాగే  అల్లరిగా ఉండేవాడా? రిజర్వ్‌డ్‌గా ఉండేవాడా? ఆ  మహాకవి యవ్వనంలో విశేషాలు ఏమిటి?
 
  కవి కాని వారు కూడా కవిత్వం రాస్తే... పోనీలే పాపం అంటూ కవిత్వం పరుగెత్తుకు వస్తుంది!
 అలాంటిది విశ్వకవి ప్రేమకవిత్వం రాస్తే? కవిత్వం ఇంద్రధనసై విరుస్తుంది కదా!
 మరి ఆయన ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయికి ప్రేమలేఖ రాశారా?...యంగ్ టాగూర్ అనగానే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మనలో సహజంగానే ఉంటుంది.
 సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ టాగూర్...ది మేకింగ్స్ ఆఫ్ ఏ జీనియస్’ పుస్తకం చదివితే ‘యంగ్ టాగూర్’ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం విశ్వకవి యవ్వన ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.
 
  టాగూర్  పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉండగా అమ్మ చనిపోవడం, ఒంటరితనం, వదిన  కాదంబరితో అనుబంధం, భారతీయ విలువలకు, పాశ్చాత్య ప్రపంచానికి మధ్య సమన్వయం సాధించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే కాక యవ్వనంలోని రవీంద్రుడి అంతఃప్రపంచాన్ని చూపారు. తాను సృజనశీలి కావడానికి రవీంద్రుడు ఏర్పర్చుకున్న దారి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సృజనశీలతకు నిలువెత్త్తు మనిషి అయిన రవీంద్రుడి వెనుక ఉన్న అసలు సిసలు మనిషిని  ఈ పుస్తకంలో చూడవచ్చు.
 

మరిన్ని వార్తలు