కన్ను గురించి కొన్ని విషయాలు...

23 May, 2015 01:18 IST|Sakshi
కన్ను గురించి కొన్ని విషయాలు...

పిల్లల కోసం ప్రత్యేకం
మన శరీరంలో ఉన్న అన్ని కండరాల కంటే కంటి కండరం చాలా చురుకైనది ఒక కంటిలో ఉన్న పనిచేసే అన్ని భాగాలను కలుపుకుంటే అవి దాదాపు 20 లక్షలకుపైగా ఉంటాయని అంచనా  ఒకరి జీవితకాలంలో కన్ను 2.40 కోట్ల దృశ్యాలను/ చిత్రాలను చూస్తుందని ఒక అంచనా  ఒకే ఒక్క క్షణంలో వందలాది కండరాలకు కదలిక తెప్పించగల సామర్థ్యం కన్నుకు ఉంది కన్ను మూసి తెరవడం (బ్లింకింగ్) అన్న ప్రక్రియ సెకనులోని పదోవంతులో జరుగుతుంది  ఒక సాధారణ వ్యక్తి రోజూ కనీసం 11,500 సార్లు కళ్లను మూసితెరు స్తాడు.  (బ్లింక్ చేస్తాడు).

అదే ఏడాదికాలంలో నాలుగు కోట్ల 20 లక్షల సార్లు కళ్లను బ్లింక్ చేస్తాడు  ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కళ్లు తెరచి తుమ్మలేరు  స్త్రీ, పురుషులలో పురుషులు చిన్న అక్షరాలను చదవగలరు. అదే పురుషులతో పోలిస్తే మహిళల్లో వినికిడి శక్తి ఎక్కువ.

మరిన్ని వార్తలు