ఇదిగో వారధి...

11 Oct, 2013 00:34 IST|Sakshi
ఇదిగో వారధి...

ఉద్యోగం పురుష లక్షణం అన్నది ఒకప్పటిమాట. ఉద్యోగం మనుష్య లక్షణం అన్నది నేటి బాట. మనం నడిపే బండి మనకి సరిపోతుందా? లేదా? సౌకర్యంగా ఉంటుందా? లేదా? కొన్నాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందా? లేదా? అని చూడడానికి టెస్ట్‌డ్రైవ్స్ ఉంటాయి. కానీ మన జీవితాన్ని ఉంచాలా? ముంచాలా? అని నిర్ణయించే ఉద్యోగానికి టెస్ట్ డ్రైవ్ ఉందా అంటే... ఉంది. ఆ టెస్ట్ డ్రైవ్ పేరే ఇంటర్న్‌షిప్.

విద్యార్థుల టెంపరరీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కంపెనీలు టెంపరరీ ఎంప్లాయీ రిక్వైర్‌మెంట్, ఈ రెంటినీ కలిపితే ఇంటర్న్‌షిప్ సెలవుల్లో ఖాళీయే. ఎలాగో 20 ఏళ్ళుగా నేర్చుకుంటూనే ఉన్నాం కదా! దాన్ని ఈసారి ఎక్కడైనా అప్లై చేయాలి ‘ఏ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉందో ఎవరికి తెలుసు’ ఒక విద్యార్థి అయోమయం. ‘ఉన్న పనికి సరిపడా ఇంటర్న్ ఎవరైనా ఉన్నారా’ ఓ కంపెనీ అనుమానం. ఈ రెంటినీ పటాపంచలు చేసి కంపెనీలకి  విద్యార్థులకు మధ్య వారధిలా నిలిచింది ఇంటర్న్ ఫీవర్.కామ్

 ముగ్గురు స్నేహితురాళ్ళ సరదా పార్టీ సంభాషణల నుండి పుట్టిందే ఈ ఇంటర్న్ ఫీవర్.కామ్. ఆ ముగ్గురే ఈ వెబ్ పోర్టల్ ఫౌండర్స్ అయిన స్నేహప్రియ, కృష్ణప్రియ, అర్పిత (హైదరాబాద్) ‘యూఎస్‌లో స్టూడెంట్స్‌కి  కంపెనీలకి మధ్య ఇంటర్న్‌షిప్ కోసం వెబ్‌సైట్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి వెబ్‌ని ఒకటి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది?’ అనుకున్నారు ఆ ముగ్గురూ. ఆ సంవత్సరం మొత్తం బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు. సర్వేలు నిర్వహించారు. అభిప్రాయాలు సేకరించారు.

జనవరి 2010లో పుట్టిన ఆ ఆలోచన, నవంబర్ 2010కి ఆచరణలోకి వచ్చింది. దేశంలోని వివిధ సంస్థలు, కంపెనీలని సంప్రదించి వాళ్ళకి ఉన్న ఇంటర్న్ రిక్వైర్‌మెంట్ గురించి తెలుసుకుంటారు. ఇంటర్న్‌షిప్‌కి ఉండవలసిన అర్హతలు, ఇంటర్న్‌షిప్ ఎన్ని రోజులు ఉంటుంది... తదితర వివరాలను జోడించి పొందుపరుస్తారు. విద్యార్థులు అవసరమైనప్పుడు, తమకు తగ్గ ఇంటర్న్‌షిప్‌ని వెతుక్కుని అప్లయ్ చేసుకోవచ్చు. ఆర్ట్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ తదితర రంగాలకు సంబంధించిన ఇంటర్న్‌షిప్ వివరాలు ఈ వెబ్‌సైట్‌లో కోకొల్లలు.
 
‘‘మీకు మా వెబ్‌సైట్‌లో రెండురోజుల నుండి మూడు నెలల వరకు డ్యూరేషన్ ఉన్న ఇంటర్న్‌షిప్ దొరుకుతాయి. వీలును బట్టి అప్లయ్ చేసుకోవచ్చు. డబ్బులు తీసుకొని ఇంటర్న్‌షిప్ ఇచ్చే వాళ్ళకోసం, సర్టిఫికేట్స్ కోసం ఇంటర్న్‌షిప్ చేసే వాళ్ళకోసం మేము పనిచేయం. ఒక కంపెనీ రిక్వైర్‌మెంట్‌కి వచ్చిన అప్లికేషన్స్ నుండి మేము, మా హెచ్‌ఆర్ టీమ్ కలిసి ఒక ఇంటర్న్‌షిప్‌కి 10-20 అభ్యర్థులని ఆయా కంపెనీలకు పంపిస్తాం. దానితో కంపెనీలకు ఎంచుకోవడం సులభం అవుతుంది.

మేము ఈ ఇంటర్న్‌షిప్‌తో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తాం. కేర్, కోవీ లాంటి సంస్థలతో కలిసి ఎంట్‌‌‌రరపెన్యూర్ స్టార్టప్స్‌ని వృద్ధి చేసుకోవడానికి గెడైన్స్ కూడా ఇస్తాం. ‘ౌ్ట ఛిట్ఛ్చ్ట్ఛ 21ట్ట ఛ్ఛ్టిఠటడ ఛిజ్టీజ్డ్ఛీ’ అనేది మా కంపెనీ మోటో. అందుకు తగ్గట్టుగానే వేల మంది విద్యార్థులకి, అలాగే చాలా కంపెనీలకు మధ్య వారధిగా నిలిచాం’’ అంటారు కంపెనీ ఫౌండర్లలో ఒకరైన స్నేహప్రియ. వీళ్ళు చెప్పటమే కాక ఆచరిస్తారు. వారి మీద వారే ప్రయోగాలు చేస్తారు. 50 మంది దాకా ఉన్న స్టాఫ్‌లో సగానికి పైగా పనిచేసే వాళ్ళు కూడా ఇంటర్న్‌అవడం ఇందుకు నిదర్శనం. ఇంక ఆలస్యమెందుకు? వెంటనే మీ రెజ్యూమ్‌ని పంపండి, తినే ముందే రుచి చూసేయండి.

 http://www.internfever.com  
 - జాయ్

 

మరిన్ని వార్తలు