అరచేతి అందం

20 Jul, 2018 01:03 IST|Sakshi

ఆషాఢం

మెహెందీ కోన్స్‌తో అరచేత అందమైన డిజైన్లు తీర్చిదిద్దుకోవాలని ముచ్చటపడు తుంటారు అతివలు. కానీ, చర్మ సమస్యలు వస్తాయేమో అనే భయం. అలాంటి భయాలేవీ లేకుండా ఇంట్లోనే కోన్‌ని తయారుచేసుకోవచ్చు.

తయారీ
స్టెప్‌ :1 పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి, బాగా కలపాలి.

స్టెప్‌ :2 కొద్దిగా నీళ్లతో చిక్కటి మిశ్రమం అయ్యేవరకు కలపాలి. 

స్టెప్‌ :3  హెæన్నా ఉన్న గిన్నెను ప్లాస్టిక్‌ షీట్‌తో పూర్తిగా మూసి, 15 నిమిషాలసేపు ఆ గిన్నెను పక్కన పెట్టేయాలి. 

స్టెప్‌ :4  15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మిశ్రమం మృదువుగా తయారవుతుంది. దీంట్లో మరికొద్దిగా నీళ్లు, ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపాలి. తర్వాత మళ్ళీ ప్టాస్టిక్‌ షీట్‌తో కవర్‌ చేసి, ఈసారి గంటసేపు వదిలేయాలి. పంచదార కరిగి మిశ్రమం చిక్కబడుతుంటుంది.

స్టెప్‌ :5  ప్లాస్టిక్‌ షీట్‌ తీసేసి, మిశ్రమాన్ని మళ్లీ ఒకసారి కలపాలి. మిశ్రమంలో ఎక్కడా పొడి తాలూకు గడ్డలు లేకుండా మృదువుగా అవుతుంది. 

స్టెప్‌ :6  ప్లాస్టిక్‌ షీట్‌తో కోన్స్‌ తయారుచేసుకోవాలి. నోట్‌: హ్యాండ్‌ రోల్డ్‌ ఎమ్టీ కోన్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. 

స్టెప్‌ :7  కోన్‌లో ముప్పావు భాగం వరకు హెన్నా మిశ్రమం నింపి, టేప్‌తో మూసేయాలి. తర్వాత నచ్చిన డిజైన్‌ తీర్చిదిద్దుకోవాలి.

ఈ పదార్థాలు అవసరం..
∙హెన్నా పొడి – 100 గ్రాములు
∙ఆర్గానిక్‌ గోరింటాకు పొడి (హెర్బల్‌ స్టోర్స్‌లో లభిస్తుంది) 
∙డిస్టిల్డ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ – 30 ఎం.ఎల్‌ 
(హెన్నా ముదురు రంగులో తేలాలంటే టీ ట్రీ ఆయిల్, 
లావెండర్‌ ఆయిల్, ఇలాచీ పొడులు కూడా కలుపుతుంటారు)
∙మంచినీళ్లు
∙పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు  (హెన్నా మిశ్రమం గట్టిగా అవడానికి) 

మరిన్ని వార్తలు