ఒక పెద్ద ఏసీ మిషన్ = ముక్కు!

20 Oct, 2016 00:03 IST|Sakshi
ఒక పెద్ద ఏసీ మిషన్ = ముక్కు!

 పోరాటం
నోస్ ఫ్యాక్ట్స్

 

ముక్కు ఒక ఎయిర్ కండిషనర్‌లా వ్యవహరిస్తుంది. ప్రతిరోజూ అది దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతుంటుంది.   ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో ఉన్న గాలి కావాలి. అందుకే తేమ తక్కువగా ఉన్న గాలిలో తేమ కల్పించడానికి ఒక్కో సీజన్‌లో ముక్కు దాదాపు లీటరు తేమను స్రవిస్తుంటుంది. ముక్కులోని ఎర్రటి స్పాంజ్ కణజాలం నుంచి ఈ తేమ ఊరుతూ ఉంటుంది.

ముక్కు రంధ్రాలు గాలిని శుభ్రం చేస్తుంటాయి. నూనెలో ముంచితీసినట్టుగా ఉండే పేపరును గాల్లో వేలాడదీస్తే, దానికి పురుగులు అంటుకున్నట్లుగా ముక్కులోని  వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అలా అంటుకుంటాయి. అయితే ముక్కు రంధ్రాలు వాటిని అక్కడ పేరుకోనివ్వవు. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా బ్యాక్టీరియా మయం అయిపోతుంటుంది. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్‌ను ముక్కు... ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటుంది.

మరిన్ని వార్తలు