ఏసీ వల్లనే ఈ సమస్యలా?

22 Aug, 2015 10:39 IST|Sakshi
ఏసీ వల్లనే ఈ సమస్యలా?

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
 
 చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు!

 నా వయసు 40 ఏళ్లు. గతంలో మోకాళ్ల నొప్పులు చాలా ఆలస్యంగా వచ్చేవేమోగానీ... నా విషయంలో ఈ వయసులోనే వచ్చాయి. అయితే ఈ నొప్పులను భరించలేక డాక్టర్‌ను కలిశాను. డాక్టర్ తగిన పరీక్షలు నిర్వహించి, కీళ్లమార్పిడి శస్త్రచికిత్స చేయించమన్నారు. ఇంత చిన్న వయసులో ఈ సర్జరీ అవసరమా? నాకు వేరే ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నా విషయంలో తగిన సలహా ఇవ్వండి.
 - సుధాకర్‌రావు, కొండాపూర్

 మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే మీరు వర్ణించిన దాని ప్రకారం... ఈ తరహా నొప్పుల్లో 80 శాతం ఆర్థరైటిస్ సమస్యతోనే వస్తుంటాయి. మోకాళ్ల నొప్పులకు మోకాలి చుట్టూ ఉండే క్వాడ్రిసెప్స్ అనే కండరం బలహీనంగా మారడమే ప్రధాన కారణం. మోకాలికి నలువైపులా ఈ క్వాడ్రిసెప్స్ కండరాలు ఒక కూడలిలా ఉంటాయి. తొడ దారుఢ్యం మీదే వీటి మనుగడ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు జీవనం సాగించడానికి చేసే అన్ని రకాల వృత్తుల్లోనూ ఎంతో కొంత శారీరక శ్రమ ఉండేది. అందుకే పాతతరం వాళ్లలో 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు రావడం అన్నది చాలా అరుదు. ఇప్పటికీ ఆ తరం వారిలో మోకాళ్ల నొప్పులు తక్కువే.

ఇక శస్త్రచికిత్స విషయానికి వస్తే... మోకాళ్ల నొప్పిగానీ, కీళ్లనొప్పులు గానీ వచ్చిన ప్రతివారికీ డాక్టర్లు శస్త్రచికిత్స సూచిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే. మోకాళ్ల నొప్పుల్లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి రెండు దశల్లో ఉదయం లేవగానే మోకాళ్లు పట్టేసినట్లుగా ఉండటం, మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పిగా ఉండటం, నడుస్తున్నప్పుడు చిన్న శబ్దలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశల్లో వ్యాయామాలు చేయడం, కొన్ని రకాల మందులు వాడితే సరిపోతుంది. చాలామందిలో ఈ దశలోనే ఈ సమస్య పరిష్కారమైపోయి, నొప్పులు తగ్గిపోతాయి. కానీ ఒకవేళ సమస్య అప్పటికే మూడో దశకు చేరుకొని ఉంటే మాత్రం ఈ మందుల వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చేయించుకొమ్మని డాక్టర్లు సూచిస్తారు. కాబట్టి ముందుగా మీరు డాక్టర్‌ను కలిసి మీ మోకాలి నొప్పులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోండి, సరైన వైద్య చికిత్స పొందండి.
 
క్యాన్సర్ కౌన్సెలింగ్
 
నాకూ రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?
నా వయసు 45 ఏళ్లు. మా అక్క తన 53 ఏట రొమ్ముక్యాన్సర్ వల్ల కన్నుమూసింది. ఆమెకు తప్ప మా కుటుంబంలో ఎవరికీ రొమ్ము క్యాన్సర్ ఉన్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) లేదు. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? నేనేమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందా?  - సులోచన, రాజమండ్రి

కుటుంబంలో ఎవరికీ రొమ్ము క్యాన్సర్ లేని ఫ్యామిలీ చరిత్ర గలవారితో పోలిస్తే కుటుంబంలో ఎవరికో ఒక్కరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉన్నవారి కుటుంబ సభ్యులకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లే. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు సోదరిగానీ, తల్లి గానీ అయితే (పైగా వారికి చిన్న వయసులోనే అంటే 35 ఏళ్లలోపే వస్తే) ఈ కుటుంబసభ్యులకూ రొమ్ముక్యాన్సర్ వచ్చే రిస్క్ రెండు రెట్లు. అంటే కుటుంబసభ్యులకు తప్పనసరిగా క్యాన్సర్ వస్తుందని కాదు. కానీ జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ అని అర్థం. ఇక మిగతా అంశాలు అంటే... జీవనశైలి, ఆహారం లేదా ఇతర అలవాట్లు, వ్యాయామం, స్థూలకాయం, శారీరకంగా కష్టపడకపోవడం  వంటివి కూడా క్యాన్సర్‌కు దోహదం చేయవచ్చు.

ఒకవేళ మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్న కోవకు చెందుతారని భావిస్తే... దీనికి నివారణగా ముదురాకుపచ్చగా ఉండే ఆకుకూరలు తీసుకుంటూ, శరీర బరువును తగినంతగా ఉండేలా చూసుకుంటూ, నిత్యం వ్యాయామం చేస్తూ, క్రమం తప్పకుండా ఫిజీషియన్ ఫాలోఅప్‌లో ఉండి, వారు సూచించిన స్క్రీనింగ్ పరీక్షలు (మామోగ్రామ్ వంటివి) చేయించుకుంటూ ఉంటే, వ్యాధి వచ్చినా దానికి విజయవంతంగా చికిత్స చేయించుకోవచ్చు.

 నా కూతురు వయసు 10 ఏళ్లు. ఆమెకు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వేయించే అవకాశం ఉంటుందా? ఈ వ్యాక్సిన్ వల్ల ఆమెకు కలిగే రక్షణ ఏ మేరకు ఉంటుంది. - విజయకుమారి, అమలాపురం

మీ పాపకు మీరు హెచ్‌పీవీ అనే వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఇది సర్వైకల్ క్యాన్సర్ అనే క్యాన్సర్‌ను రాకుండా నివారిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి. ఈ వ్యాక్సిన్‌ను పెళ్లికి ముందు వేయిస్తారు. సాధారణంగా 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసులో ఆర్నెల్లకొకసారి చొప్పున మూడు మోతాదులు ఇప్పించడం వల్ల సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నుంచి 90 శాతం రక్షణ లభిస్తుంది. దీని సైడ్‌ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ.

ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్ నుంచి మాత్రమేగాక, పులిపిరులు (వార్ట్స్) నుంచి కూడా రక్షణ ఇస్తుంది. సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ ఉందని తెలిశాక కూడా దీని విస్తృతి ఎక్కువగా ఉందంటే, ఇప్పటికీ చాలామంది మహిళలకు దీనిపట్ల అవగాహన లేకపోవడమే కారణం. దీని గురించి అందరికీ తెలిసిన నాడు అసలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేదే సమాజంలో లేకుండా పోతుంది.
 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 
ఇంత చిన్నపాపకే డయాబెటీసా?
 మా పాప వయసు ఆరేళ్లు. చక్కెరవ్యాధి వచ్చింది. ఇంత చిన్నవయసులో కూడా పిల్లలకు డయాబెటిస్ వస్తుందా? చిన్నపిల్లల్లో డయాబెటిస్ వస్తే వారు ఎప్పటికీ ఆ వ్యాధితో బాధపడాల్సిందేనా? మా పాప విషయంలో తగిన సలహా ఇవ్వగలరు.
 - సునంద, ఖమ్మం

మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటిస్  అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటీస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతమాత్రాన బాధపడాల్సిందేమీ లేదు. వీళ్లలోనూ చక్కెరను అదుపు చేస్తే వీళ్లూ సాధారణమైన పిల్లలందరిలాగానే పెరిగి, పెద్దవారై అన్ని రంగాల్లో తవు ప్రతిభాపాటవాలు చూపగలరు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి కేవలం జన్యుపరమైన కారణాలు మాత్రమే గాక... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా కారణం అవుతారుు. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి.

దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లు చేరుుంచడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయుడం కూడా అవసరం. డయాబెటిస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయూలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిస్ ఉన్న పిల్లలరుుతే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణలో లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్‌హేలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రాబోతున్నారుు. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతారుు. మీరు పీడియూట్రిషియున్ పర్యవేక్షణలో మీ పాపకు చికిత్స తీసుకోవడం తప్పనిసరి.
 
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్

 
ఏసీ వల్లనే ఈ సమస్యలా?
 నా వయసు 35. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి.
 - సుధీర్, హైదరాబాద్

మీరు చెప్పిట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి...

తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.

పొడి చర్మం: చాలా సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం.

దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.

అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు (గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ) ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు.
     
శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు.  

అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం.
 

మరిన్ని వార్తలు